KL Rahul: టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో వెస్టిండీస్ ను చిత్తు చేసింది. ఇక రెండో వన్డేలోనూ కరేబియన్ ను మట్టి కరిపించి సిరీస్ దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఆటగాళ్ల కూర్పుపై శ్రద్ధ తీసుకుంటోంది. మొదటి వన్డేలో రాణించిన వారికి రెండో్ వన్డేలోనూ చోటు కల్పించాలని చూస్తోంది. కరోనా ప్రభావంతో మొదటి వన్డేకు దూరమైన ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో చేరడంతో జట్టు కూర్పుపై సందిగ్దం నెలకొంది.

ఓపెనర్లుగా వచ్చే వైఎస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇప్పుడు జట్టు లో చేరడంతో జట్టు ఏర్పాటుపై మళ్లీ కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మొదటి వన్డేకు కేఎల్ రాహుల్ దూరం కావడంతో ఇషాన్ కిషన్ ను ఆడించారు. దీంతో ఇప్పుడు రాహుల్ రావడంతో కిషన్ ను ఏ స్థానంలో పంపాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నట్లు తెలుస్తోంది. ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కు దిగనున్నట్లు సమాచారం.

Also Read: ఆసియా శ్రీమంతుడు అదానీనే.. కరోనా సంక్షోభంలో లాభపడ్డది ఆయనొక్కడే..!
ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాడు. ఆటగాళ్ల ఎంపికపై ఫోకస్ పెడుతున్నాడు. వెస్టిండీస్ ను చిత్తు చేసేందుకు ఎత్తులు వేస్తున్నాడు. సిరీస్ ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడు. ఆటగాళ్ల సామర్థ్యంపై అంచనాలు వేసుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. కరేబియన్ ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు.
ఇప్పటికే మొదటి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరిన టీమిండియా రెండో వన్డేలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్టిండీస్ కు అవకాశం ఇవ్వొద్దనే చూస్తోంది. ఇందుకుగాను ఆటగాళ్లు సమష్టి గా రాణించాలని భావిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆటతో విజయం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
Also Read: తెలంగాణలో మూడో దశ ముగిసినట్లేనా?