IPL 2022 Auction: ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీని కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభం కానుంది. దీనికి గాను ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నారు. ఇటీవల అండర్ -19 ప్రపంచ కప్ గెలుచుకోవడంతో ఆటగాళ్లలో హుషారు ఉన్నా వారు ఐపీఎల్ కు అర్హత సాధించలేకపోవడం విచారకరమే. మంచి ఫామ్ లో ఉన్నా వారికి అందివచ్చిన అవకాశాలు తలుపులు మాత్రం తెరవడం లేదు.

ఎందుకంటే వారు దేశవాలీ క్రికెట్ లో ఆడిన అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. మరోవైపు 19 ఏళ్లైనా నిండి ఉండాలి. ఈ లెక్కన మంచి నైపుణ్యం ప్రదర్శించిన వారికే ఈ అవకాశం కలిసి రావడం లేదు. దీంతో ఆటగాళ్లో నైరాశ్యం నెలకొంది. తమకు కలిసి వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లకు అర్హత సాధించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
ఈనెల 17 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం అవుతున్నా ఆటగాళ్ల వేలం 12 నుంచే ప్రారంభం కావడంతో ఆటగాళ్లు తమ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని అవాంతరాలున్నా ఆటగాళ్ల ప్రతిభను చూపించుకునే వీలు దక్కకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆసియా శ్రీమంతుడు అదానీనే.. కరోనా సంక్షోభంలో లాభపడ్డని ఆయనొక్కడే..!
ఆటగాళ్ల వేలంలో 590 మంది పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో ఎవరిని ఎవరు కొనుగోలు చేస్తారో తెలియడం లేదు. టాలెంట్ ను నమ్ముకున్నా కలిసి రాకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. అండర్ -19లో తమ సత్తా చాటినా ఇక్కడ మాత్రం చోటు దక్కకపోవడం బాధాకరమే. వారు మరో సంవత్సరం పాటు ఆగాల్సిందేనని తెలుస్తోంది.
అండర్ -19లో ఆడిన వారిలో కనీసం ఎనిమిది మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు అర్హత సాధించలేకపోతున్నారు. జట్టును ముందుండి నడిపించిన వారికే ఆ ఘనత దక్కడం లేదు.దీంతో వారిలో ఆందోళన కలుగుతోంది. దీంతో బీసీసీఐ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? వారికి దారి దొరుకుతుందా? అనేది అనుమానంగానే ఉంది.
Also Read: సమ్మె చేయాలని ఉద్యోగులను చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ రెచ్చగొడుతున్నారా?