https://oktelugu.com/

Rajamouli : సంక్రాంతి నుంచి రాజమౌళి హవా కొనసాగబోతుందా..?

ప్రస్తుతం చాలా మంది హీరోలు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి విపరీతం గా కష్టపడుతున్నారు. ఇక మొత్తానికైతే వాళ్ళను వాళ్ళు టాప్ రేంజ్ లో ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు... ఇక డైరెక్టర్స్ కూడా తనదైన రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా పాన్ ఇండియా లో తన సత్తా చాటుకొని నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు..

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 / 04:37 PM IST

    Will Rajamouli Hawa continue from Sankranti..?

    Follow us on

    Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక రాజమౌళి ఇప్పటికే ఆయన తీసిన సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే దానిమీద ప్రతి ఒక్కరికి ఆసక్తి అయితే కలుగుతుంది. ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబుతో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు. ఇక  ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకొని ఈ సినిమాను తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకువెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం పాన్ వరల్డ్ లో రాజమౌళి పేరు మారు మ్రోగుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తీస్తే రాజమౌళి ఇప్పటి వరకు ఇండియా లో ఎవరు సాదించని గొప్ప విజయాన్ని సాధిస్తాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇండియాలో ఉన్న ప్రతి దర్శకుడు కూడా పాన్ వరల్డ్ సినిమా చేయడానికి చాలా వరకు సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పాన్ ఇండియాకి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి ఇక ఆయన ఇప్పుడు తెలుగు సినిమాను ఎల్లలు దాటిస్తూ పాన్ వరల్డ్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
    ముందుకెళ్తే తప్ప ఆయన ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించలేడు. ఇక ఒక్కసారి పాన్ వరల్డ్ లో మన తెలుగు సినిమా సత్తాను చాటినట్టయితే మన వాళ్ళను మించిన వారు మరొకరు ఉండరనేది కూడా ప్రూవ్ అవుతుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప గుర్తింపును తీసుకురావడంలో రాజమౌళి మొదటి నుంచి కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు…
    ఇక ఈ సినిమాని సంక్రాంతి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇన్ని రోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించిన వర్క్ లో తను అహర్నిశలు కష్టపడుతున్నాడు. అయితే మొదట ఒక వెర్షన్ అనుకున్నారట. అది అంత బాగా వర్క్ అవుట్ అవ్వదనే ఉద్దేశ్యంతో మరొక వెర్షన్ ను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
    ఇక దాని కోసమే ఈ సినిమా షూట్ అనేది రోజురోజుకు లేటవుతుంది. ఇక ఎట్టకేలకు సంక్రాంతి నుంచి ఈ సినిమా రెగ్యూలర్  షూట్ కి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి, మహేష్ బాబు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు అనేది…