Hyderabad Sunrisers: కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ పండుగకు వేళవుతోంది. మ్యాచ్ ల నిర్వహణతో ప్రేక్షకుల మదిని దోచుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇందుకనుగుణంగా ఆటగాళ్లతో ప్రాక్టీసు చేయిస్తున్నాయి. దీంతో ఆటగాళ్ల టాలెంట్ ను ఉపయోగించుకుని ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆటల్లో ప్రావీణ్యం చూపాలని నిరంతరం ఆలోచిస్తున్నాయి. గత సీజన్ లో ఎదురైన చేదు అనుభవాలతో గుణపాఠం నేర్చుకోవాలని తలపిస్తున్నాయి.

దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆటగాళ్ల ఎంపికలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలుస్తోంది. ప్రతిభ ఉన్న వారిని కాదని ఎందుకుపనికి రాని వారిని ఎంచుకుని తప్పు చేసిందనే అప్రదిష్ట మూటగట్టుకుంది. మంచి ఫామ్ లో ఉన్న వారిని వదిలేసి పేలవ ప్రదర్శన చేసే వారిని ఎంచుకుని మరీ వారికి డబ్బులు తగలేసింది. దీంతో సన్ రైజర్స్ పై సహజంగానే విమర్శలు వస్తున్నాయి.
గత సీజన్ లో కూడా సన్ రైజర్స్ ప్రదర్శన ఏమంత బాగా లేదు. దీంతో అపఖ్యాతి పాలైంది. సమ ఉజ్జీలైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో విఫలమైందనే వాదనలు కూడా వచ్చాయి. ఈసారి కూడా అలాంటి తప్పిదమే చేసిందని తెలుస్తోంది. ఈ సీజన్ లో కూడా సన్ రైజర్స్ చివరి స్థానంలోనే నిలుస్తుందని అభిమానులు, నిపుణులు చెబుతున్నారు.
Also Read: అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?
సన్ రైజర్స్ నిర్వాహకురాలు కావ్య తీరుపైనే అందరికి ఆగ్రహం పెరుగుతోంది. ఆటగాళ్ల ఎంపికపై మొదటి నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. ఆటగాళ్ల ఎంపికలో ఏ ప్రాతిపదిక పాటించారో అర్థం కావడం లేదు.దీంతో ఫ్రాంచైజీపై ఆగ్రహం పెరుగుతోంది. బలహీనమైన జట్టు గా కూర్చారని ప్రచారం సాగుతోంది. దీంతో వచ్చే సీజన్ లో ఏ మేరకు విజయాలు నమోదు చేస్తుందో తెలియడం లేదు.
గత ఏడాది ఊడా ఇదే తీరుగా పేలవ ప్రదర్శన చేయడంతో అందరిలో ఆగ్రహం కలిగింది. దీంతో ఈసారైనా మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను తీసుకుని మంచి విజయాలు నమోదు చేస్తుందని ఆశించినా అది కూడా నిరాశే కలిగించేలా ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ పరుగుల వేటలో ముందుంటుందా? లేక వెనుకబడి పోతుందా అని అందరు ఆలోచనలో పడిపోతున్నారు.
Also Read: మూడో కూటమిలో జగన్ చేరతారా? కేసీఆర్ తో కలుస్తారా?