Chandrababu-Ganta Srinivasa Rao: క‌న్ఫ్యూజ్ చేస్తున్న గంటా.. చంద్ర‌బాబు ర‌మ్మ‌న్నా రావ‌ట్లే.. వేరే ప్లాన్ ఉందా..?

Chandrababu-Ganta Srinivasa Rao: విశాఖ ప‌ట్నం రాజ‌కీయాల‌ను క‌ను సైగ‌ల‌తో శాసించిన ఆయ‌న ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న‌కు అనుచ‌రులు ఉన్నారు. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం కావ‌డంతో చంద్ర‌బాబు కూడా ఏరికోరి ఆయ‌న్ను పార్టీలో అంద‌లం ఎక్కించారు. ఆయ‌నే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ఈయ‌న చాలా కాలంగా టీడీపీలో యాక్టివ్ గా ఉండ‌ట్లేదు. పార్టీ ఎలాంటి పిలుపు ఇచ్చినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయానా ఆయ‌న మాత్రం ఎమ్మెల్యేగా […]

Written By: Mallesh, Updated On : February 18, 2022 4:05 pm
Follow us on

Chandrababu-Ganta Srinivasa Rao: విశాఖ ప‌ట్నం రాజ‌కీయాల‌ను క‌ను సైగ‌ల‌తో శాసించిన ఆయ‌న ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న‌కు అనుచ‌రులు ఉన్నారు. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం కావ‌డంతో చంద్ర‌బాబు కూడా ఏరికోరి ఆయ‌న్ను పార్టీలో అంద‌లం ఎక్కించారు. ఆయ‌నే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ఈయ‌న చాలా కాలంగా టీడీపీలో యాక్టివ్ గా ఉండ‌ట్లేదు. పార్టీ ఎలాంటి పిలుపు ఇచ్చినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు.

Chandrababu-Ganta Srinivasa Rao

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయానా ఆయ‌న మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పార్టీ అధికారానికి దూరం కావ‌డంతో.. ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదు. త‌న ప‌ని తానుచేసుకుంటూ పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మారుతార‌నే సంకేతాలు వినిపించాయి. జ‌న‌సేన‌లోకి వెళ్తార‌నే ప్ర‌చారం ఇప్ప‌టికీ జ‌రుగుతూనే ఉంది.

ఈ ప్రచారంపై కూడా ఆయ‌న ఎక్క‌డా స్పందించ‌లేదు. దీంతో చంద్ర‌బాబు కూడా ఆయ‌న మీద దృష్టి పెట్టారు. కాగా అమ‌రావ‌తి ఉద్య‌మంలో భాగంగా రాజీనామా చేసినా అది ఆమోదం కాలేదు. ఈ ప‌రిస్థితుల న‌డుమ ఆయ‌న టీడీపీలోనే ప్ర‌యాణం అన్న‌ట్టు మొన్న సంకేతాలు ఇచ్చారు. కానీ మ‌ళ్లీ షాక్ ఇస్తున్నారు. ఉత్త‌రాంధ్ర స‌మావేశానికి రావాలంటూ చంద్ర‌బాబు ఆహ్వానించినా ఆయ‌న వెళ్ల‌ట్లేదు.

Also Read: అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?

త‌న‌కు వేరే ప‌ని ఉంద‌ని, తాను త‌ర్వాత వ‌చ్చి చంద్ర‌బాబును క‌లుస్తానంటూ స‌మాచారం ఇచ్చారంట‌. అయితే ఈ విష‌యం మీద చంద్ర‌బాబు కూడా సీరియ‌స్ గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న వ‌స్తేనే పార్టీలో క్రియాశీల‌కంగా ఉంటార‌ని, లేదంటే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి కొత్త ఇన్ చార్జిని ప్ర‌క‌టిస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీకోసం ప‌నిచేసే వారికే పెద్ద‌పీట అని ఇప్ప‌టికే చంద్రబాబు ప్ర‌క‌టించారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో గంటా ఎందుకు వెళ్ల‌ట్లేద‌నే అనుమానాలు బాగానే వినిపిస్తున్నాయి. ఆయ‌న ఏమైనా ప్లాన్ లో ఉన్నారేమో అంటున్నారు త‌మ్ముళ్లు. మ‌రి ఇప్ప‌టికే ఎన్నిక‌ల వేడి క‌నిపిస్తున్న నేప‌థ్యంలో గంటా ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read: మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?

Tags