Medaram Jatara: దక్షిణ భారత దేశ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. నిన్ననే గద్దె మీదకు సమ్మక్క ఆగమనంతో వనం మొత్తం జనం అయిపోయింది. దేశ నలుమూలల నుండి ఆదివాసీలు, గిరిజనులు, ఇతర వర్గాలకు చెందిన వారంతా తరలి వస్తుండటంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. మేడారం రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంటోంది. దీంతో సాధారణ భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
తల్లుల దర్శనం చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీఐపీలకు మాత్రమే చాలా సింపుల్ గా దర్శనం అవుతోంది. కానీ కాలినడకన లైన్ లో నిలబడి దర్శనం చేసుకుందామనుకునే వారికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా ఇంతటి రద్దీలా చాలా సార్లు తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఈ తొక్కిసలాటలో భాగంగా అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట ఎక్కువ కావడంతో ఇద్దరు భక్తులు చనిపోయారు.
Also Read: KCR To Visit Medaram Jatara: మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం
అయితే ఈ తొక్కిసలాటకు కారణం పోలీసులే అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు సమన్వయం చేసుకోలేకపోవడంతోనే ఇది జరిగిందంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సమ్మక్క నిన్న రాత్రి గద్దెమీదకు వచ్చింది. కాబట్టి సమ్మక్కను దర్శనం చేసుకోవాలని ఒక్కసారిగా భక్తులు విపరీతంగా రావడంతో ఈ విధమైన తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
అయితే ఈరోజు సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా అమ్మలను దర్శించుకోనున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఆయన మేడారం వెళ్లి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక సీఎం వెళ్తే మరింత సేపు లైన్లలోనే భక్తులను ఆపేసే అవకాశం ఉంది. దాంతో మరిన్ని తొక్కిసలాటలు జరుగుతాయంటున్నారు భక్తులు. మరి పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అంతా కోరుతున్నారు. ఇప్పటికే అమ్మలను దాదాపు 60లక్షల మంది దర్శించుకున్నారు.
Also Read: Medaram Jatara 2022: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు