Ashada Masam: ఆషాడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం కదా. ఆఫర్లు ఫుల్, పండగలకు స్వాగతం పలుకుతుంది. చేతులకు గోరింటాకు అయితే ఎర్రగా కనిపిస్తుంటుంది. అమ్మాయి అంటే అందం. ఆ అందానికి గోరింటాకు పెడితే మరింత అందం కదా. ఈ ఆకు చేతులను అందంగా చేస్తుంది. ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. గోరింటాకు అందమే కాదు ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు. మామూలుగా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటారు. కానీ ఆషాడ మాసం వచ్చిందంటే ఓ నాలుగైదు సార్లు పెట్టుకుంటారు.
మరి ఈ మాసంలో ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి? రీజన్ ఏంటి అనే వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. దీని గురించి చాలా విధాలుగా చెబుతుంటారు పెద్దలు. అందులో కొందరు కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి వస్తుందని.. ఆ సమయంలో వారు తమ సౌభాగ్యాన్ని గుర్తు చేసుకునేలా గోరింటాకు పెడతారట. పుట్టింట్లో ఉన్నా కూడా తన మనసు మెట్టినింట ఉన్న తన భర్త ఆరోగ్యాన్ని కోరుకుంటుందని అర్థమట.
ఇక పెళ్లి కాని అమ్మాయిలు సంగతి ఏంటి అనుకుంటున్నారా? కాబోయే భర్త గురించి ఊహించుకుంటూ గోరింటాకు పెట్టుకుంటారట. ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడనే నమ్మకం కూడా ఉంది. వర్షాకాలంలో ఎక్కువ సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఇక పొలం పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో చర్మ వ్యాధులు, గోళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ వ్యాధుల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి గోరింటాకు పెట్టుకోవాలి అంటారు నిపుణులు.
అయితే ఆషాఢంలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారుతుంది. దీంతో ఈ సీజన్‌లో కఫం, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఇక రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంటుంది. వాటి నుంచి బయటపడి, శరీరంలో వేడి తగ్గించడానికి గోరింటాకు పెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఓ సారి పెట్టుకోండి.