https://oktelugu.com/

Actress: ఓ వైపు సినిమాలు.. మరోవైపు పాత చీరల అమ్మకం వ్యాపారం.. ఈ నటి గురించి తెలుసా?

Actress: అసలు విషయమేంటంటే.. వారు సినిమాల్లో వచ్చిన డబ్బుతో కాకుండా ఇతర వ్యాపారం చేసిన డబ్బుతో కార్లు కొనుగోలు చేస్తుంటారు. లేటేస్ట్ గా ఓ హీరోయిన్ బీఎం డబ్ల్యూ కారు కొనుగోలు చేసింది. అయితే ఈమె ఓ ఆశ్చర్యకరమైన వ్యాపారం చేస్తుంది. ఆ బిజినెస్ కు మంచి డిమాండ్ కూడా ఉందట. ఇంతకీ ఆమె చేసేదేంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2024 / 03:24 PM IST

    Navya Nair buys BMW x7 luxury SUV Car

    Follow us on

    Actress: సినీ ఇండస్ట్రీ హీరోయిన్లు కారును కలిగి ఉండడం కామన్. కానీ కొందరు సాధారణ వెహికల్ తీసుకుంటే.. మరికొందరు ఖరీదైన కార్లలో తిరగాలని అనుకుంటారు. అయితే సినిమాల్లో అవకాశాలు ఉన్నా లేకున్నా.. కొందరు ఖరీదైన కార్లు కొనడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అసలు విషయమేంటంటే.. వారు సినిమాల్లో వచ్చిన డబ్బుతో కాకుండా ఇతర వ్యాపారం చేసిన డబ్బుతో కార్లు కొనుగోలు చేస్తుంటారు. లేటేస్ట్ గా ఓ హీరోయిన్ బీఎం డబ్ల్యూ కారు కొనుగోలు చేసింది. అయితే ఈమె ఓ ఆశ్చర్యకరమైన వ్యాపారం చేస్తుంది. ఆ బిజినెస్ కు మంచి డిమాండ్ కూడా ఉందట. ఇంతకీ ఆమె చేసేదేంటంటే?

    మలయాళ ఇండస్ట్రీలో నవ్య నాయర్ అంటే ఎవరైనా గుర్తుపడుతాయి. ‘ఇష్టం’ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత కుంజికూనన్, కళ్యాణ రామన్, అమ్మకిలిపాడు లాంటి పలు సినిమాల్లో నటించింది. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియళ్లలో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంది. నవ్య నాయర్ ఇటీవల బీఎం డబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    నవ్య నాయర్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తుంది. ఆమె చేసే వ్యాపారం ఏంటంటే చీరలు విక్రయించడం.. చీరల వ్యాపారం అంటే ఏ షాపింగ్ మాలో.. సారీ సెంటరో కాదు.. పాత చీరలను అమ్మడం. అంటే ఒకసారి వాడి పడేసిన వాటిని నవ్య నాయర్ తిరిగి వాటిని విక్రయిస్తోందట. వాటిని ఈమె అభిమానులు ఎగబడి మరీ కొంటున్నారట. ఇలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పాత చీరల అమ్మే వ్యాపారంతో బిజీగా ఉంటుందట.

    మలయాళంతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నవ్య నాయర్ ఫేమస్ అని చెప్పవచ్చు. తమిళంలో గజ మూవీలో నటించి పేరు తెచ్చుకుంది. కన్నడంలో దృశ్యం 1, 2 సినిమాల్లో కనిపించింది. అయితే తెలుగులో కూడా నటించాలని కొందరు సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు. అయితే ఈ బ్యూటీ తెలుగులోకి వస్తుందా? లేదా? చూడాలి.