Why Use Dipper At Night On Trucks: ట్రక్కుల వెనుక “హార్న్ ఓకే ప్లీజ్”, “యూజ్ డిప్పర్ ఎట్ నైట్” అని రాసి ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా వీటిని గమనించారా? మీలో చాలా మందికి “హార్న్ ప్లీజ్” అంటే తెలిసే ఉంటుంది. కానీ ఈ “యూజ్ డిప్పర్ ఎట్ నైట్” అని ఎందుకు రాసి ఉంటుంది? దాని అర్థం ఏమిటి? అని ఆలోచించారా? అయితే ఎందుకు టెన్షన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్రక్కు వెనుక రాసిన ఈ సందేశం చాలా లోతైన, ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉంది. ట్రక్కుల వెనుక “యూజ్ డిప్పర్ ఎట్ నైట్” అని ఎందుకు రాసి ఉంటుందంటే?
“డిప్పర్” అంటే ఏమిటి?
ముందుగా, డిప్పర్ అంటే ఏమిటో తెలుసుకుందామా? డిప్పర్ అనేది వాహనాల హెడ్‌లైట్‌ల సెట్టింగ్. దీనిని “లో బీమ్” అని కూడా పిలుస్తారు. రాత్రిపూట డ్రైవర్ హై బీమ్‌ను ఉపయోగించినప్పుడు, ముందు నుంచి వచ్చే వాహనాల డ్రైవర్ల కళ్ళలోకి ప్రకాశవంతమైన కాంతి వెళ్ళవచ్చు. ఇది ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, ట్రక్ డ్రైవర్లు రాత్రిపూట ఇతర వాహనాలను డిప్పర్ (లో బీమ్) ఉపయోగించమని అభ్యర్థిస్తారు. తద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నమాట.
ఈ సందేశం ట్రక్కుల వెనుక మాత్రమే ఎందుకు రాశారు?
ట్రక్కులు సాధారణంగా చాలా దూరం ప్రయాణిస్తాయి. తరచుగా రాత్రిపూట ప్రయాణిస్తుంటాయి. ట్రక్కులు పెద్దవి. బరువైనవి కాబట్టి, వాటి డ్రైవర్లు వెనుక నుంచి వచ్చే వాహనాల లైట్లను సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం అని భావిస్తారు. కారు లేదా బైక్ డ్రైవర్ హై బీమ్‌పై ట్రక్కును అనుసరిస్తుంటే, ట్రక్కు సైడ్ మిర్రర్‌లోని మెరుపు కారణంగా డ్రైవర్ ముందున్న రహదారిని స్పష్టంగా చూడలేకపోతాడ. ఇది ప్రమాదానికి దారితీయవచ్చు. అందువల్ల, ట్రక్కుల వెనుక భాగంలో ‘రాత్రిపూట డిప్పర్‌ను ఉపయోగించండి’ అని రాస్తారు.
Also Read: Pawan Kalyan : లారీ డ్రైవర్ ఆవేదన.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్!
భారతదేశంలో, ట్రక్కుల వెనుక భాగంలో “హార్న్ ప్లీజ్” అని కూడా రాసి ఉంటుంది. అంటే వెనుక నుంచి వచ్చే వాహనాలు ఓవర్‌టేక్ చేసే ముందు హారన్ ఇవ్వండి అని అర్థం. ఇలా చేస్తే వారిని కాస్త త్వరగా గుర్తించవచ్చు. కానీ రాత్రి సమయంలో, హారన్‌తో పాటు లైట్లు సరిగ్గా ఉపయోగించడం మరింత ముఖ్యం. అందువల్ల, డ్రైవర్లు హై బీమ్‌కు బదులుగా లో బీమ్‌ను ఉపయోగించి సురక్షితంగా ఉండటానికి “రాత్రిపూట డిప్పర్‌ను ఉపయోగించండి” అనే సందేశం ఇవ్వడానికి ఇలా రాశారు అన్నమాట.
రోడ్డు భద్రతకు
రోడ్డు భద్రతకు ఈ చిన్న సందేశం చాలా ముఖ్యం. రాత్రిపూట హై బీమ్ వాడటం వల్ల ట్రక్ డ్రైవర్లకు మాత్రమే కాకుండా ఇతర డ్రైవర్లకు కూడా సమస్యలు వస్తాయి. హై బీమ్ లైట్ కారణంగా, ముందు ఉన్న వాహనం డ్రైవర్ కళ్ళు చాలాసార్లు మసకబారుతాయి, దీనివల్ల బ్రేకింగ్ ఆలస్యం అవుతుంది. ప్రమాదానికి దారితీయవచ్చు. అందువల్ల, రాత్రిపూట డిప్పర్ వాడితే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
కండోమ్ తో కూడా సంబంధం
యూజ్ డిప్పర్ ఎట్ నైట్ అనే సందేశం తక్కువ కాంతికి మాత్రమే కాకుండా కండోమ్‌లకు కూడా సంబంధించినది. వాస్తవానికి, 2005లో, పెరుగుతున్న ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ కేసులను నివారించడానికి ప్రజలలో సురక్షితమైన సెక్స్ గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు యూజ్ డిప్పర్ ఎట్ నైట్‌తో ఒక ప్రచారం ప్రారంభించారు. దీని రహస్య సందేశం సెక్స్ సమయంలో కండోమ్‌లను ఉపయోగించడమే. ఈ ప్రచారం కోసం డిప్పర్ బ్రాండ్ కండోమ్‌లను కూడా ప్రారంభించారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.