Homeఅంతర్జాతీయంRussia Israel War: రష్యా, ఇజ్రాయెల్‌.. యుద్ధం ఎలా చేయాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి..!

Russia Israel War: రష్యా, ఇజ్రాయెల్‌.. యుద్ధం ఎలా చేయాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి..!

Russia Israel War: ప్రపంచంలో ప్రస్తుతం మూడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో రెండు యుద్ధాలు గతేడాదికి కొనసాగింపుగా జరుగుతున్నవే. మరో యుద్ధం ఈ ఏడాది ప్రారంభమైనా తక్కువ సమయంలోనే ముగిసింది. ప్రస్తుతం పాస్‌ మోడ్‌లో ఉంది. అయితే ఈ మూడు యుద్ధాల్లో భారత్‌–పాకిస్తాన్‌ వార్‌ ఒకటి. ఇదే సీజ్‌ఫైర్‌ మోడ్‌లో ఉంది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ వార్‌ భీకరమైంది.

ఆధునిక యుద్ధాలు త్వరగా ముగుస్తాయని అంతా అనుకుంటారు. కానీ, ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న మూడు యుద్ధాల్లో రెండు సుదీర్ఘంగా సాగుతున్నాయి. తద్వారా యుద్ధాలు చేస్తున్న ఇరు దేశాలు నష్టపోతున్నాయి. ఈ మూడు యుద్ధాలను పోచ్చి చూసినప్పుడు యుద్ధం ఎలా చేయాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి అనిపిస్తోంది. ఇజ్రాయెల్, రష్యా వంటి దేశాల కంటే కొన్ని సందర్భాలలో భారతే మెరుగు అన్న భావన కలుగుతుంది.

ఉక్రెయిన్‌–రష్యా వార్‌..
ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది. యుద్ధం ప్రారంభమైన మొదట్లో వారం పది రోజుల్లో యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. కానీ శక్తివంతమైన రష్యాతో ఉక్రెయిన్‌ ఇప్పటికీ తలపడుతోంది. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో విదేశీ ఆయుధాలతో పోరాడుతోంది. ఇక రష్యా సుదీర్ఘ యుద్ధంతో తీవ్రంగా నష్టపోతోంది. రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడుతున్నారు. యుద్ధ విమానాల్లో ఇంధనం అయిపోతోంది. మరోవైపు రష్యా దాడితో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. దాని పునర్నిర్మాణానికి నాలుగైదు దశాబ్దాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రష్యా జెలన్‌స్కీని తప్పించాలనుకుంటోంది. కానీ, మూడేళ్లయినా అది సాధించలేకపోయింది.

Also Read:  Iran-Israel War: ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వేళ.. కాశ్మీర్ చరిత్రలో కొత్త అధ్యాయం

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం..
ఇక ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం కూడా గతేడాదికి కొనసాగింపుగానే జరుగుతోంది. గతేడాది ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడిచేసింది. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై మిసైళ్లతో దాడిచేసింది. ఇప్పుదానిని కొనసాగిస్తోంది. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న లక్ష్యంతో అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడిచేస్తోంది. మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇదే సమయంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని గద్దె దించాలని చూస్తోంది. అవకాశం వస్తేం చంపడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ మధ్య 1500 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో ఇరాన్‌ కేవలం మిసైళ్లు, విమానాలతో మాత్రమే దాడిచేస్తోంది. ఇరాన్‌ సుప్రీంను చంపాలంటే ఇజ్రాయెల్‌ సైన్యం భూభాగంలోకి వెళ్లాలి అది జరిగే పరిస్థితి లేదు. అందుకే ఇజ్రాయెల్‌ అమెరికాను కూడా యుద్ధరంగంలోకి రావాలని కోరుతోంది. ఇక ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్‌ బలమైన ఐరన్‌ డోమ్‌ విఫలమైంది. దీంతో మరో ఆధునిక అస్త్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ యుద్ధంలో ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు.

పాస్‌ మోడ్‌లో భారత్‌–పాక్‌ యుద్ధం..
ఇక కశ్మీర్‌లో ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో యుద్ధం మొదలు పెట్టింది. కేవలం ఐదు రోజుల్లో యుద్ధం ముగించింది. భారత్‌ స్పష్టమైన లక్ష్యాలతో చేయాలనుకున్న పని చేసేసింది. ఆధునిక కాలంలో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదన్న భావనతో యుద్ధం ముగించింది. పాకి, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలతోపాటు, పాకిస్థాన్‌లోని 11 ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసింది. ఇదే సమయంలో యుద్ధం ముగియడంలో అమెరికా ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లు నేనే యుద్ధం ఆపించామని చెప్పుకున్న అమెరికాకు షాక్‌ ఇచ్చింది.

Also Read:  Modi On Israel Iran War: ఇజ్రాయోల్ ఇరాన్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఎమన్నాడంటే..

సుదీర్ఘ యుద్ధంతో నష్టం..
సుదీర్ఘ యుద్ధంతో ఇరువైపులా నష్టం ఉంటుందని భారత్‌కు తెలుసు. అందుకే మోదీ తాను అనుకున్న లక్ష్యం పూర్తి చేశారు. చాలా మంది పీవోకేను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కానీ, ఎక్కువ కాలం యుద్ధం చేయకూడాదని భారత్‌ భావించింది. మరోవైపు దౌత్యపరంగా కూడా ప్రపంచంలో పాకిస్థాన్‌ను దోషిగా చూసేందుకు ఎంపీల బృందాలు పదే దేశాల్లో పర్యటించాయి. మరోవైపు సింధూ జలాల నిలిపివేతతో పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థపైనే దెబ్బకొట్టింది. ఇలా భారత్‌ స్పష్టంగా నష్టం లేకుండా యుద్ధం ముగించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular