https://oktelugu.com/

Newly married couples : పెళ్లయిన కొత్తలో జంటలు టెన్షన్ ఎందుకు పడతారు? దీనికి కారణం ఏంటి?

ఈ రోజుల్లో పెళ్లి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. పెళ్లి చేసుకోవాలంటే అన్నింటికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. వీటిన్నింటికి ఖర్చు చేయాలి, మళ్లీ అప్పు పెరుగుతుందని కొందరు జంటలు ఆందోళన చెందుతారు. అప్పు చేసి మరి ఎక్కువగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం కంటే తక్కువ ఖర్చుతో ఉన్నంతలో చేసుకుంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 4:56 pm
    Newly married couples

    Newly married couples

    Follow us on

    Newly married couples : ఈ జనరేషన్‌లో పెళ్లికి రెడీ చెప్పే వారి కంటే నో చెప్పే వారే ఎక్కువగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలు, పాస్ట్ రిలేషన్‌లో జరిగిన విషయాలు, చుట్టూ ఉన్న జంటలను చూసి చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే ఈ జనరేషన్‌లో పెళ్లి చేసుకునే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేసుకుంటున్నారు. పెళ్లంటే చాలా భయంతో చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో భాగస్వాముల మధ్య అసలు సరైన కమ్యునికేషన్ ఉండదు. ఏదో కలిసి ఒక ఇంటిలో ఉంటారు. అంతే కానీ ఎవరి పనుల్లో వాళ్లు ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలను చూసి కొత్త జంటలు పెళ్లంటే చాలా భయపడుతున్నారు. అసలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే గొడవలు పడి చాలా మంది విడిపోతున్నారు. దీనికి ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం అని భావించి పూర్తిగా పెళ్లి జోలికి పోవట్లేదు. ఒకవేళ చేసుకున్న ఇలానే రిలేషన్ అవుతుంది ఏమోనని భయపడుతున్నారు.

    ఈ రోజుల్లో పెళ్లి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. పెళ్లి చేసుకోవాలంటే అన్నింటికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. వీటిన్నింటికి ఖర్చు చేయాలి, మళ్లీ అప్పు పెరుగుతుందని కొందరు జంటలు ఆందోళన చెందుతారు. అప్పు చేసి మరి ఎక్కువగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం కంటే తక్కువ ఖర్చుతో ఉన్నంతలో చేసుకుంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఈరోజుల్లో ఫొటో షూట్ ఒక ట్రెండ్ అయిపోయింది. పెళ్లి, ఎంగేజ్‌మెంట్ ఇలా ప్రతీదానికి ఫొటో షూట్ తప్పనిసరి. వీటికి భారీగా ఖర్చు అవుతుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కేసారి కదా అని ఖర్చు పెట్టి చేసుకున్న తర్వాత ఆ అప్పులు తీర్చడానికే సగం జీవితం అయిపోతుందని భావిస్తున్నారు. కనీసం ప్లానింగ్ లేకుండా ఖర్చు చేస్తుంటారు. ఎంగేజ్‌మెంట్, ఫొటో షూట్, హల్దీ, రిసెప్షన్, మ్యారేజ్, బ్యాచిలర్ పార్టీ ఇలా ఒక్కోదానికి అయ్యే ఖర్చు గురించి కొత్త జంటలు ఎక్కువగా భయపడుతున్నాయి. ఆదాయానికి మించి ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటే తప్పకుండా పెళ్లి తర్వాత ఇబ్బందులు వస్తాయి.

    పెళ్లయిన తర్వాత కూడా భాగస్వాములకు కొన్ని కోరికలు ఉంటాయి. అక్కడికి వెళ్లాలని, ఇక్కడికి వెళ్లాలని అనుకుంటారు. వీటిన్నింటికి డబ్బులు ఉండవు. ఇప్పటికే పెళ్లి ఖర్చు భారీగా అయి ఉంటుంది. మళ్లీ ఈ ఖర్చు అంటే కొత్త జంటలు భయపడుతున్నాయి. అప్పులు చేసి పెళ్లి చేసుకుని బాధపడటం కంటే ఒంటరిగా జీవితాంతం ఉండిపోవడం బెటర్‌ అని భావిస్తున్నారు. పెళ్లి అనేది గొప్పగా చేసుకోక్కర్లేదు. చేసుకున్న తర్వాత భాగస్వామితో సంతోషంగా ఉంటే చాలు. మధ్యలో విడిపోకుండా జీవితాంతం కలసి మెలసి ఉండాలి. కానీ ఈ రోజుల్లో గొప్ప కోసమే ఎక్కువ మంది అప్పు చేసి మరి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా చేసుకోకుండా ఉన్నంతలో చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.