Hair Cutting: మానవుల ఆరోగ్యం దృష్ట్యా పురాతన కాలంలో పెద్దలు కొన్ని నిబంధనలు చేర్చారు. వాటిని తరతరాలుగా కొందరు పాటిస్తూ వస్తున్నారు. అయితే నేటి కాలంలో వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి వీటిని ఏర్పాటు చేసింది ఆరోగ్యం కోసమే. సాధారణంగా చెబితే వినరని కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి చెప్పడం వల్ల పాటిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వీటిలో క్షవరం చేసుకున్న తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లకుండా ఉండడం.. గోర్లు కత్తిరించిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఉండడం వంటివి ఉన్నాయి. ఈ విషయాలను ఇప్పుడు చెబితే కొందరు వేరే రకంగా చూస్తారు. కానీ ఇందులో గూడార్థం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ హెయిర్ కటింగ్ చేసుకొని నేరుగా ఇంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు?
మానవ శరీరంలో వెంట్రుకలు, గోర్లు అనేవి కూడా అవయవాల కిందకి వస్తాయి. మనం బ్లేడ్ తో స్కిన్ ఎక్కడైనా కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. ఈ సమయంలో ఎంతో బాధ వేస్తుంది. అంటే ఆ సమయంలో మనకు తెలియకుండానే ఆ ప్రదేశంలో నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. అలాగే శరీరంలో భాగమైన వెంట్రుకలు కట్ చేసుకోవడం వల్ల శరీరంలోని ఆరా దెబ్బతింటుంది. ఈ సమయంలో కొన్ని నెగటివ్ శక్తులు ఆవహించడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాకుండా శరీరానికి సంబంధించిన వెంట్రుకలను కట్ చేయడం వల్ల ఈ సమయంలో కొందరు నరదృష్టితో చూసిన కూడా ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. అయితే హెయిర్ కట్ చేసుకున్న తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లడం వల్ల.. ఇంకా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిత్యం గొడవలు కావడం.. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం.. ఆరోగ్య సమస్యలు ఉండడం వంటివి ఉంటాయి. ఎందుకు కారణం నెగటివ్ ఎనర్జీ రావడమే.
అయితే పూర్వకాలంలో క్షవరం చేసుకునే తర్వాత ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కాదు. అంతేకాకుండా బయటనే స్నానం చేసి ఇంట్లోకి అడుగు పెట్టేవారు. ఇలా చేయడం వల్ల శరీరంపై ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు హెయిర్ కట్ చేసుకున్న తర్వాత తల స్నానం చేసి.. ఇతర పనులు చేయాలి. అంతవరకు ఇతర ఏ పనులు చేయకుండా ఉండాలి. అయితే కొందరు చెబుతున్న ప్రకారం హెయిర్ కట్ చేసుకున్న తర్వాత శరీరంపై వెంట్రుకలు ఉంటాయి. మీరు ఇంట్లో అటు ఇటు తిరగడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పడి అపరిశుభ్రంగా మారుతుంది. అందువల్ల స్నానం చేయాలని చెబుతున్నారు.
ఇక గోర్లు కత్తిరించుకున్న తర్వాత కూడా పరిశుభ్రంగా చేతులను కడుకోవాలని అంటారు. అయితే గోర్లలో మట్టి తాగి ఉంటుంది. వీటిని కట్ చేసిన తర్వాత ఆ మట్టి పైన అలాగే ఉండిపోతుంది. దీంతో చేతులు అశుభ్రంగా ఉండి అనుకోకుండా ఏదైనా ఆహార పదార్థం తినాల్సి వస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గోర్లు కత్తిరించుకున్న తర్వాత చేతులను శుభ్రంగా చేసుకోవాలని చెబుతారు.