Homeలైఫ్ స్టైల్After Marriage: పెళ్లయిన తర్వాత మహిళల శరీరంలో మార్పులెందుకు? దీనికి కారణం ఏంటంటే?

After Marriage: పెళ్లయిన తర్వాత మహిళల శరీరంలో మార్పులెందుకు? దీనికి కారణం ఏంటంటే?

After Marriage: మహిళలు ఒక్కో స్టేజ్‌లో వాళ్ల బాడీలో మార్పులు చూస్తారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత వాళ్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందులో ఒకటి బరువు పెరగడం. అయితే పెళ్లి అయిన తర్వాత వాళ్ల శరీరంలోని హార్మోన్ల మార్పులు వల్ల ఎక్కువ మంది అమ్మాయిలు బరువు పెరుగుతారు. దీనికి కారణం శృంగారం అని చాలా మంది భావిస్తారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పుల వల్ల బరువు పెరుగుతారని అంటున్నారు. ఇంతకీ ఆ మార్పులేంటి? ఏ ఏ కారణాల వల్ల మహిళలు పెళ్లి అయిన తర్వాత బరువు పెరుగుతారో తెలుసుకుందాం.

పెళ్లి తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో వాళ్లకి ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఈ కారణంగా బరువు పెరుగుతారు. అలాగే పెళ్లయ్యాక ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి వల్ల తప్పనిసరిగా బరువు పెరుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈరోజుల్లో చాలామంది పెళ్లి అయిన తర్వాత బయటకు ఎక్కువగా వెళ్తుంటారు. బయట ఫుడ్ తినడం వల్ల కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కలయిక వల్ల బరువు పెరుగుతారని సైంటిఫిక్‌గా ఇంకా ఫ్రూఫ్ కాలేదు. కానీ కలయిక తర్వాత ఆకలితో అతిగా తినడం వల్ల బరువు అధికంగా పెరుగుతున్నారు. పెళ్లయిన తర్వాత చాలామందిలో జీవక్రియ రేటు తగ్గిపోతుంది. దీనివల్ల ఒక్కసారిగా బరువు పెరుగుతారు. పెళ్లియ్యాక మహిళల రోజూ దినచర్య మారిపోతుంది. పెళ్లికి ముందు కొందరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటారు. కానీ పెళ్లయిన తర్వాత అంతా వదిలేసి కేవలం భర్తను చూసుకోవడానికి ఇంట్లో ఉండిపోతారు. దీంతో వాళ్లు రోజూ ఒకే దినచర్యను ఫాలో అవుతారు.

మహిళలు ఇంట్లో ఉండటం వల్ల ఆహారం తిన్న వెంటనే కొన్నిసార్లు నిద్రపోతారు. ఇలా చేస్తే తప్పకుండా బరువు పెరుగుతారు. దీనికి తోడు అందరు తిన్న తర్వాత ఏదైనా పదార్థం కొంచెం మిగిలిపోతే.. వేస్ట్ చేయడం ఎందుకని వాళ్లే తినేస్తారు. కొంతమందికి నిద్రలేమి వల్ల ఆకలి కోరికలు బాగా పెరుగుతాయి. దీనివల్ల ఆకలిని అదుపు చేసుకోలేరు. సమయం సందర్భం లేకుండా తింటుంటారు. దీంతో బరువు పెరుగుతారు. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవాలి. కుటుంబ బాధ్యలతో బిజీ అయిపోయి కొంతమంది మహిళలు అసలు వాళ్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. కనీసం వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయరు. వీటివల్ల నడుము, కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల వాళ్లు బరువు పెరుగుతారు. అంతే కానీ తరచుగా శృంగారం చేయడం, కలయికలో పాల్గొనడం వల్ల బరువు పెరుగుతారని అనుకోవడం అపోహ మాత్రమే. ఇందులో ఎలాంటి నిజం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. పెళ్లయిన తర్వాత బరువు పెరగకుండా ఉండాలంటే తినే ఆహారంలో మార్పులు చేయడంతో పాటు వ్యాయామం చేస్తే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

 

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version