Rama Chiluka: ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే జన్మలో కూడా విడిపోయేవారు కాదు. కొన్ని సార్లు ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో భర్త కాపురం చేసేవారు కానీ విడాకుల ప్రస్తావన వచ్చేది కాదు. గొడవలు జరిగేవి కావు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా ఇష్టపడి చేసుకున్న పెళ్లి అయినా కానీ ఎన్ని కష్టాలు వచ్చిన కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న గొడవకు విడిపోతున్నారు దంపతులు. కారణం చిన్నదే కానీ గొడవలే పెద్దగా చేస్తున్నారు. అందుకే మనషులను రాముడితో పోల్చినా ఆ పేరు మాత్రం రాలేదు.
ఈ భూమి మీద ఎన్నో పశుపక్షాదుల ఉన్నాయి. అందులో రామ చిలుకకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రామ చిలుకకు ముందు రామ అనే పేరు ముందు ఎందుకు వచ్చింది అని ఎప్పుడు అయినా అనుకున్నారా? రాముడు ఎంత గొప్పవాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణం గురించి చదివినా విన్నా ఆ రామయ్య ప్రత్యేకత తెలుస్తోంది. ఇక ఆ రాముడు సీతమ్మను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేదు. ఆ సీతమ్మ కూడా ఎంత కష్టం వచ్చినా రాముడి కోసమే ఎదురుచూసింది.
చిలుక ఒకసారి మరొక చిలుకతో జతకడితే ఆ చిలుకతోనే తన జీవితం మొత్తం కలిసి ఉంటుందట. మరొక చిలకతో జతకట్టదట. అందుకే ఈ చిలుకను రాముడితో పోలుస్తుంటారు. రామ చిలుక అనడానికి ఆ రామయ్యను అనుసరించింది అంటే రామయ్య ఏకపత్నీ వ్రతుడు. అలాగే చిలుక కూడా ఒక చిలుకతో మాత్రమే ఉంటుంది కాబట్టి చిలుకకు రామ అనే పేరు వచ్చింది అంటారు. ఇలా మన వాతావరణంలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. కానీ వీటి గురంచి తెలియడం కాస్త కష్టం.
రాముడు, సీతల వివాహం గురించి వారి వనవాసం గురించి తెలిస్తే ఎవరు కూడా విడాకులు తీసుకోరు. ఈ కాలంలో చిన్న చిన్న సమస్యలకే విడాకులు, గొడవలు అంటూ గడిపేస్తున్నారు ఈ కాలం యువత. కలిసి ఉండాలి అనుకోవడం లేదు. ఒకరితో గొడవ అయితే వీరిని వదిలిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. వారితో గొడవలు జరిగినా మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి చిలుక రామ అనే పేరును సంపాదించినట్టు మీరు కూడా సంపాదించాలి అనుకుంటే ఆ రామయ్య బాటలో నడవాల్సిందే.