Homeఎంటర్టైన్మెంట్Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో లారెన్స్... ఆయన చేసిన పని తెలిస్తే శభాష్...

Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో లారెన్స్… ఆయన చేసిన పని తెలిస్తే శభాష్ అంటారు!

Raghava Lawrence: రాఘవ లారెన్స్ గొప్ప మానవతావాది. ఆయన తల్లి పేరిట అనాథ శరణాలు, ఛారిటీ ట్రస్టులు నడుపుతున్నారు. ఆపదలో ఉన్నవారెందరినో ఆదుకున్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా సంపాదించిన డబ్బుల్లో చాలా వరకు సోషల్ సర్వీస్ కి ఖర్చు చేస్తాడు. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. దివ్యాంగులకు బైక్స్ పంపిణీ చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రాఘవ లారెన్స్ గతంలో దివ్యాంగులకు వాహనాలు, ఇళ్ళు సమకూరుస్తామని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా బైక్స్ అందజేశాడు.

విలువిద్యలో ప్రతిభ చూపిన దివ్యాంగులకు ఇళ్ళు, వాహనాలు అందిస్తానని రాఘవ లారెన్స్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి దశగా బైక్స్ అందజేశాడు. ఇక త్వరలో ఇళ్ళు కూడా వారికి ఏర్పాటు చేస్తానని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. రాఘవ లారెన్స్ తమకు చేసిన సహాయానికి దివ్యాంగులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కాగా… నెటిజెన్స్ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అనేక దానాలు చేస్తున్నప్పటికీ రాఘవ లారెన్స్ ఎవరి వద్దా ఫండ్స్ వసూలు చేయడు. తన సొంత డబ్బులతోనే సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన పలుమార్లు చెప్పారు. ఎవరైనా తనకు డబ్బు పంపిస్తే ఆయన సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇక రాఘవ లారెన్స్ కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతం.

గ్రూప్ డాన్సర్ గా ఆయన కెరీర్ మొదలైంది. టాలెంట్ తో కొరియోగ్రాఫర్ అయ్యాడు. స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతటితో ఆగకుండా దర్శకుడిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. నాగార్జున హీరోగా రాఘవ లారెన్స్ తెరకెక్కించిన మాస్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక ప్రక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూనే హీరోగా సక్సెస్ అయ్యాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన సిరీస్ విజయం సాధించింది.

RELATED ARTICLES

Most Popular