
Old Age Marriage : ఇటీవల కాలంలో ట్రెండ్ మారుతోంది. యువతలో ఉండే ప్రేమ వృద్ధుల్లోనూ కనిపిస్తోంది. తోడు కోసం అరవై ఏళ్లు దాటిన తరువాత వెంపర్లాడుతున్నారు. దీంతో ప్రస్తుతం పరిస్థితులు విభిన్నంగా ఉంటున్నాయి. అరవై ఏళ్లు దాటాక గోడ పట్టుకుని నాకు నడక వచ్చిందని అన్నట్లుగా ఉందని కొందరు విమర్శిస్తున్నా ప్రస్తుత పరిస్థితులు వారిని అలా మార్చుతున్నాయని చెబుతున్నారు. జీవితంలో తోడు లేని జీవితం మోడులాగా అనిపిస్తుంది. అందుకే కడదాకా ఒకరు తోడుండాలని భావించడంలో తప్పు లేదు. కానీ లేటు వయసులో ఇలాంటి నిర్ణయం అందరిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయినా వారిలో మార్పు కనిపించం లేదు.
ఎందుకిలా..
మనుషుల్లో ఈ మార్పు ఎందుకొస్తోంది. పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దీంతో కుటుంబంలో అందరి అవసరాలు తీరేవి. ఏది కావాలన్నా అందరు సమష్టి నిర్ణయం తీసుకుని పరిష్కరించుకునే వారు. ఈ నేపథ్యంలో ఎలాంటి కష్టాలు ఉండేవి కావు. అందరు అందరికి సాయం చేసుకునే వారు. కాలక్రమంలో ఉమ్మడి కుటుంబాలు అంతరించాయి. చిన్న కుటుంబాల గోల పెరిగింది. దీంతో నలుగురితో చిన్న కుటుంబం బాగున్నా తోడు దూరమైతే వారి ఇబ్బందులు వర్ణనాతీతం. దీంతోనే వారు ఇంకో తోడు కోసం తపిస్తున్నారు.
తోడు అవసరమేనా?
ఈ వయసులో తోడు అవసరమేనా? పనులు చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. దీంతోనే తమకు ఓ తోడు కావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ నటులు నరేష్, పవిత్రల పెళ్లి గరించి సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్ర కూడా ఇదివరకే పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరు ఈ వయసులో ఏం చేస్తారనే వాదనలు వస్తున్నా వారు మాత్రం పెళ్లి చేసుకుని అందరిలో ఆశ్చర్యం నింపుతున్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో పెళ్లి అవసరమేనా అనే చర్చలు కూడా తెరమీదకు వస్తున్నాయి.
ఎటు వైపు
ఈ పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయో తెలియడం లేదు. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే ఇదివరకే ఉన్న సంతానం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్తగా కుటుంబంలోకి వచ్చే వారిపై వారికి అక్కసు ఉండటం సహజమే. దీంతో పలు గొడవలకు కూడా దారి తీస్తోంది. అయినా తమకు అండగా ఉండే వారి కోసం పెళ్లి చేసుకోక తప్పడం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కొందరు సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు. ఏదిఏమైనా అరవై ఏళ్లు దాటాక మళ్లీ పెళ్లంటే కొంచెం గందరగోళమే అయినా వారి స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించడానికి ధైర్యం చేయడం లేదు.