
NTR 30 Climax Scene: #RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రం ఈమధ్యనే పూజా కార్యక్రమం ద్వారా ప్రారంభం అయ్యింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.ఆయన కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా.తన గత చిత్రాలన్నీ పూర్తిగా సందేశాత్మక చిత్రాలుగా ఉంటాయి.ఈసారి అలాంటి సందేశాలన్ని పక్కన పెట్టి ,ఊర మాస్ సబ్జెక్టు ని రెడీ చేసాడట.
ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, ఆచార్య సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో స్క్రిప్ట్ పై రీ వర్క్ చెయ్యడానికి ఎంతో సమయం తీసుకోవాల్సి వచ్చింది.అలా సుదీర్ఘ సమయం తీసుకొని సిద్ధం చేసిన ఈ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందట.సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం లో జరిగే కథ గా ఈ చిత్రం ఉండబోతుందట.ప్రస్తుతం ఈ సినిమాలో క్లైమాక్స్ ముందు వచ్చే ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట.
ఈ సన్నివేశం లో ఒక భారీ ‘కార్గో షిప్’ ఉంటుందట.దానికి సంబంధించిన సెట్స్ ని ఏర్పాటు చేసారు.ఈ సన్నివేశం హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ భేట్స్ ఆద్వర్యం లో చిత్రీకరిస్తున్నారట.షిప్ కి సంబంధించిన ఒక భాగం సెట్ ని లొకేషన్ లో వేశారు.మిగిలిన భాగం షిప్ మరియు సముద్రపు నీళ్లు మొత్తం గ్రాఫిక్స్ తో కవర్ చెయ్యబోతున్నారు.అందుకోసం ఇప్పటి వరకు ఎవ్వరూ ఉపయోగించని హై టెక్నాలజీ కెమెరాలను వాడుతున్నారట.అలా ఈ సినిమా మేకింగ్ కి సంబంధించి ఏ చిన్న విషయం లో కూడా తగ్గేదే లే అనే విధంగా కొరటాల శివ ముందుకు దూసుకెళ్తున్నాడట.

రాబొయ్యే రోజుల్లో ఈ సినిమాకి వచ్చే అప్డేట్లు ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయ్యే రేంజ్ లో ఉంటుందని టాక్.ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ వంటి నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.వచ్చే ఏడాది ఏప్రిల్ నాల్గవ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి.