Mosquitoes Bite Reason: వర్షాకాలం వచ్చేసింది.. ఈ సీజన్‌లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే దోమలు మనుషులనే ఎందుకు కుడతాయి? ఎంతమంది ఉన్నా అదేపనిగా కొందరినే ఎందుకు టార్గెట్ చేస్తాయి.. మరికొందరిని మాత్రం అస్సలు కుట్టవు.. ఇలా మనలో మనమే చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటుంటాం. అయితే నిజానికి ఈ విషయంలో దోమలకేమీ పక్షపాతం ఉండదట. దీని వెనుక సైన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకున్నట్లే దోమలు కూడా వాటికి నచ్చిన వాళ్ల రక్తం తాగేస్తాయి. అంతలా దోమలను ఆకర్షించే అంశాలేంటో తెలుసుకుందాం.
– సాధారణంగా దోమల్లో మగ దోగమలు మనిషిని కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి. అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి.
ఈ మూడు బ్లడ్ గ్రూపులు ఎక్కువ ఇష్టపడతాయి..
– ఏ, బీ బ్లడ్ గ్రూపుల వారితో పాటు ఏబీ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన వాసనను పసిగట్టి దోమలు అటాక్ చేస్తాయట.
– చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల వచ్చే వచ్చే వాసనకు దోమలు ఆకర్షితమవుతాయని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు.
– ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.
– కార్బన్ డై ఆక్సైడ్ అంటే దోమలుకు అమితమైన ఇష్టం, ఎకువగా సీవో2 వదిలేవాళ్ల చుట్టూ దోమలు వాలిపోతుంటాయట.
– గర్ణిణులు, ఒబేసిటీతో బాధపడేవారి రక్తంలో మెటబాలిక్ రేట్స్ అధికంగా ఉంటాయట. అందుకే వీరిని దోమలు టార్గెట్ చేస్తాయట.
– చెమట ఎక్కువగా వచ్చేవారిలో లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా రసాయనాల వల్ల దోమలు కుడతాయి.
– అంతేకాకుండా నల్లరంగు దుస్తులు ఎక్కువగా వేసుకుంటే దోమలు అట్రాక్ట్ అవుతాయట.