Homeట్రెండింగ్ న్యూస్Romance On Bike: బరితెగించారు.. బైక్‌పై లవర్స్‌ రొమాన్స్‌.. రోడ్డుపైనే హద్దులు మీరి..

Romance On Bike: బరితెగించారు.. బైక్‌పై లవర్స్‌ రొమాన్స్‌.. రోడ్డుపైనే హద్దులు మీరి..

Romance On Bike: ప్రేమ గుడ్డిది అంటారు.. ఇప్పుడు కామం కూడా గుడ్డిదే అనిపిస్తుంది కొంతమంది తీరు చూస్తుంటే.. మూడొచ్చిందని ఈ మధ్య యువత బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. పాశ్చాత్య పోకడలతో పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్‌ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లో కెక్కుతున్నారు. అమ్మాయిలు అయితే సిగ్గు అనే విషయం ఎప్పుడో మర్చిపోయారు. అందరూ చేసేదే తామూ చేస్తున్నాం అన్నట్లు ఫీల్‌ అవుతున్నారు. తాజాగా దేశ రాజధాని ప్రధాన రహదారిపై ఓ యువతీ యువకులు బైక్‌పై అభ్యంతకరంగా ప్రయాణించారు.

ఢిల్లీ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై..
ఢిల్లీలోని అవుటర్ రింగ్ రోడ్‌ ఫ్లైఓవర్ మంగోల్‌పురీ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. యువకునితోపాటు యువతి కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంది. వెనకాలే వాహనంలో వెళ్తున్నవారు దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ అంశంపై నెటిజన్లు ఫైరవుతున్నారు.

నెట్టింట్లో వైరల్‌…
బైక్‌పై వెళ్తున్న యువతీ, యువకుడు బహిరంగంగా చేస్తున్న రొమాన్స్‌ దృశ్యాలను రోడ్డుపై వెళ్తున్నవారు వీడియో తీశారు. అనంతరం ట్విటర్‌లో పోస్టు చేయడంతో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేరే ప్లేస్‌ దొరకలేదు… తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు.. అంత ఆగలేకపోతున్నారా.. కామంతో కళ్లు మూసుకుపోయాయా అంటూ ఆగ్రహంతో కామెంట్స్‌ పెడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version