Husbands fear wives reasons: భార్యాభర్తల జీవితం ఎంతో అందమైనదని కొందరి భావన. కానీ ఇది కొన్ని రోజులవరకేనని మరికొందరు చెబుతూ ఉంటారు. మొదటి ఆరు నెలల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఎక్కువగా ఉంటుంది.. ఆ తర్వాత వీరిమధ్య ద్వేషం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ కొన్ని జంటలు మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో సుఖంగా ఉండగలుగుతున్నారు. అయితే ఇలా అన్యోన్యంగా ఉండే దంపతుల్లో భార్య కంటే భర్త ఎక్కువగా భయపడుతున్నారని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. భార్య విధించే షరతులకు భర్త లోబడి పనిచేస్తున్నారని చెబుతున్నారు. అసలు మొగుళ్ళు పెళ్లాలకు భయపడడానికి కారణాలు ఏముంటాయి?
కింగ్ లాంటి మొగుడు అయినా.. కొంగు చాటున ఉండాల్సిందే.. అని కొందరు రచయితలు చెబుతూ ఉంటారు. పురుషులు బయట ఎన్ని విజయాలు సాధించినా.. ఇంట్లో మాత్రం ఆడవారు చెప్పిందే వినాల్సి ఉంటుంది. అయితే కొందరు పురుషులు చెబుతున్న ప్రకారం వారు చెప్పిన మాట వినడానికి వారికి భయపడి కాదని.. వారికి ఇచ్చే గౌరవం అని అంటున్నారు. అయినా కూడా ఇంట్లో వారిదే పెత్తనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇంట్లో ఉండే వ్యవహారాలన్నీ ఆడవారు మాత్రమే చక్కబెడతారు.. అలాగే పిల్లల విషయంలో కూడా ఆడవారు చూపిన ప్రేమ మగవారు చూపలేరు. దీంతో పిల్లలు ఎక్కువగా తల్లివద్దే ఉండగలుగుతారు. ఇలాంటి సమయంలో భార్యతో గొడవ పడితే పిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం ఉండకూడదని ఉద్దేశంతోనే మొగుళ్ళు ఎక్కువగా భార్యతో గొడవ పెట్టుకోవడం ఆపేస్తారు.
కొందరు ఆడవాళ్లు మగవాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేరు. ఇదే సమయంలో వారికి పట్టరాని కోపం వస్తే చేయకూడని పనులు చేయగలుగుతారు. దీంతో ఒక్కోసారి ధన, ఆస్తి, ప్రాణం నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే మగవారు ఒక దశలో కోపం కంట్రోల్ చేసుకుంటారు. కానీ ఆడవారికి మాత్రం అలా కంట్రోల్ కాని పరిస్థితి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భర్తలు భవిష్యత్లో జరిగే నష్టానికి భయపడి గొడవ పెట్టుకోవడం మానేస్తారు.
Also Read: ఉద్యోగులతో ఇలా చేయవద్దు.. చేస్తే నష్టమే..
ఒక్కోసారి ఆడవాళ్లు తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్తారు. ఇలాంటి సమయంలో వారు ఆరోగ్య విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా వారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భార్యకు అనారోగ్యం ఏర్పడితే భర్తకి నష్టం. అందువల్ల వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారి మనసు నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు.
చాలామంది ఆడవాళ్లకు ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. వారు ఎవరితో మాట పడాలని అనుకోరు. ఇదే సమయంలో భర్త నుంచి ఏమైనా వినకూడని మాటలు వస్తే తట్టుకోలేరు. ఈ సమయంలో వారు ఎంతకైనా తెగించి వస్తువులను పగలగొట్టడం లేదా.. ఇతర నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వారికి లోబడి ఉండడమే మంచిది అని భర్తలు ఆలోచిస్తారు.
భావోద్వేగాలను పంచడంలో పురుషులకంటే మహిళలే ముందుంటారు. భార్య కన్నీళ్లు పెట్టుకుంటే భర్త కూడా బాధపడే అవకాశం ఉంది. అందువల్ల భార్యను బాధ పెట్టకూడదని భర్త నిర్ణయించుకుంటాడు. ఈ సమయంలో భార్యకు భయపడాల్సి వస్తుంది.