Workplace bullying stifles employees: చాలామంది వ్యక్తులు వ్యాపారం చేసే కన్నా.. ఉద్యోగం చేయడం ఎంతో బెటర్ అని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి నెల సరైన సమయానికి బ్యాంకులో జీతం జమ అవుతుంది. దీంతో ఎలాంటి టెన్షన్ ఉండదు. అయితే ఉద్యోగం చేయడం అంటే ఆషామాషీ కాదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడాలి. ముఖ్యంగా గ్రూప్ లీడర్ లేదా బాస్ నుంచి వచ్చే వేధింపులను తట్టుకోవాలి. అయితే కొంతమంది ఉన్నతాధికారులు తమ కిందిస్థాయి ఉద్యోగులను వేధింపులను గురి చేయడమే కాకుండా.. వారితో వెటకారాలు.. వెకిలి చేష్టలు చేయడంతో పాటు.. వారిని అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. దీనిపై కొందరు పరిశోధనలు చేయగా ఈ విషయాలు బయటపడ్డాయి.
Copenhagan లో ఇటీవల జరిగిన అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ 85వ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఓ అధ్యయనానికి బెస్ట్ పేపర్ ఇన్ ప్రొసీడింగ్ అవార్డు వచ్చింది. ఈ సదస్సు లో భారత్ లోని లక్నో ఐఐఎం ఉద్యోగుల ప్రవర్తనపై ఓ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో భాగంగా 400 మంది ఉద్యోగులను తీసుకుంది. మీరు తమ ఉన్నతాధికారి హేళన, అగౌరవాన్ని ఎదుర్కొన్నారు. దీంతో వీరు తమ విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు. అంతేకాకుండా ఇలా హేళనకు గురయ్యే వారిలో పని సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో వారు ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాగే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కూడా వారు వెనుకాడుతూ ఉంటారు. తమ ప్రాజెక్టు ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నప్పుడే.. వారు తమ భావాలను వ్యక్తపరుస్తారని.. అంతవరకు వారు తమ నైపుణ్యాలను బయటపెట్టాలని అంటున్నారు.
చాలామంది ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పని చేస్తూ ఉంటారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి స్వేచ్ఛ కావాల్సి ఉంటుంది. అయితే వారు చేసే తప్పులను ఆధారంగా చేసుకొని ఉన్నత అధికారులు వారిని నిత్యం వేధింపులకు గురి చేస్తూ.. అవమానానికి గురి చేయడం వల్ల వారు ఎంతో భావోద్వేగానికి గురవుతారు. దీంతో వారు కంపెనీ లేదా సంస్థ కోసం పనిచేయడానికి ఇష్టపడరు. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ప్రయోజనాలు కావాలని అనుకుంటారు. ఫలితంగా సంస్థకు లేదా కంపెనీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక గ్రూపు లేదా సమూహానికి లీడర్ గా ఉన్న వ్యక్తికి కూడా నష్టమే ఉంటుంది.
ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయాలంటే వారికి పూర్తి స్వేచ్చని ఇవ్వాలి. వారి ప్రాజెక్టు నచ్చకపోతే సున్నితంగా తిరస్కరించాలని.. తీవ్ర అవమానానికి గురి చేస్తే మరోసారి వారి నైపుణ్యాన్ని బయటపెట్టే అవకాశం ఉండదని అంటున్నారు. అంతేకాకుండా చాలామందిలో కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఎవరు తమ ప్రతిభను బయట పెట్టలేరని చెబుతున్నారు. ఫలితంగా ఉద్యోగం విడిచిపెట్టి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. అందువల్ల ఉద్యోగి చేసే తప్పులను ఆధారంగా చేసుకుని వారిని హేళన చేయకుండా ఉండాలని కొందరు కోరుతున్నారు.