Homeలైఫ్ స్టైల్Right To Property: తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది? కూతురుకా? కొడుకుకా? వీలునామా రాయకపోతే?

Right To Property: తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది? కూతురుకా? కొడుకుకా? వీలునామా రాయకపోతే?

Right To Property: చాలా కుటుంబాలు ఆస్తుల విషయంలో విడిపోతుంటాయి. కొందరు హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వరకు వెళ్తున్నారు. ఆస్తి ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది. దీని వల్ల జీవితంలో ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఉంటున్నారు. ఇక అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కూడా ఈ ఆస్తుల వల్ల విడిపోతున్నారు. ఒకే ఇంట్లో పుట్టి పెరిగి కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉండి కేవలం ఆస్తుల కోసం విడిపోతున్నారు. మరి ఈ ఆస్తుల విషయంలో తల్లిదండ్రులు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు.

సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో పిల్లలకు హక్కు ఉంటుంది. కుటుంబ యజమాని తన కుటుంబంలోని పిల్లలందరికి ఆస్తిని సమానంగా పంచాలి. కానీ కొన్ని సార్లు ఇలా జరగదు. కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ వస్తుంటుంది. వారికి పెట్టిన ఖర్చుల విషయంలో కూడా చివరికి గొడవ అవుతుంటుంది. ఇక వీటన్నింటిని తల్లిదండ్రులు చూసుకుంటే సమస్య ఉండదు. లేదంటే ఆస్తి పంపకాల విషయంలో అందరి మధ్య వాగ్వాదాలు రావడం కామన్ గా చూస్తుంటాం.

అయితే తమ పిల్లలకు ఆస్తులను సమానంగా పంచుతూ వీలునామ రాస్తారు తల్లిదండ్రులు. తమ తదనంతరం వారి పిల్లల మధ్య ఎలాంటి ఆస్తితగాదాలు ఉండకూడదని ఇలా వీలునామా రాస్తారు. ఇక వీలునామా విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో ఇప్పటికీ ఎన్నో చర్చలు సాగుతూనే ఉన్నాయి. మరి తండ్రి యజమాని అయితే పిల్లలందరికి సమానంగా ఆస్తి పంచుతారు. మరి ఆస్తికి యజమాని తల్లి అయితే, తల్లి పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికి పంచాలని చట్టం చెబుతుంది అనే వివరాలు చూసేద్దాం.

తల్లికి ఆస్తి యజమాని అయితే ఆమె ఎలాంటి వీలునామా రాయకపోతే ఆ ఆస్తి కుమారుడు, కుమార్తెలకు సమానంగా పంచాలట.. ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి మీదైనా పూర్వీకుల ఆస్తి మీద అయినా సమానంగా హక్కు ఉంటుంది.

హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి మీద సమానంగా కూతుర్లకు హక్కు ఉంటుందని తెలిపారు. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబంలో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు బాధ్యతలు కలిగి ఉంటారు అని వివరించారు. 2005 అనంతరం పూర్వీకుల ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందవచ్చు. ఈ విధంగా డిమాండ్ చేసే రైట్ వారికి ఉంటుందని తెలుపుతుంది చట్టం.

తల్లి వీలునామా రాసి అందులో కూతురు గురించి చర్చించకుండా కేవలం కొడుకుకు మాత్రమే ఆస్తి చెందుతుంది అని రాస్తే మాత్రం కూతురుకు ఆ ఆస్తి చెందదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామాలో ఏది రాస్తే అదే చెల్లుతుంది.

ఆస్తులను సంపాదిస్తే పొందవచ్చు కానీ మనుషులను సంపాదించడం చాలా కష్టమని గుర్తు పెట్టుకోండి. కేవలం ఆస్తుల కోసమే సొంత వారిని దూరం చేసుకోకండి. రక్త సంబంధాలకు ఎంతో విలువ ఇచ్చే మన దేశంలో ప్రస్తుతం ఆస్తుల కోసం, డబ్బు కోసం సొంత వారినే దూరం చేసుకోవడం, ఏకంగా హత్యలు చేయడం వంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు విన్న ప్రతి సారి సమాజం ఎటు వెళ్తుంది అంటూ ప్రశ్నించడం తప్ప మారే వారు చాలా తక్కువ ఉన్నారు. ప్రతి సమస్య మనింట్లో కూడా వస్తుంది. కానీ మనం ఎలా స్పందిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమే.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version