Parents Should Take Responsibility: నేటి విద్యార్థులే రేపటి మేథావులు అని కొందరు అంటుంటారు. ఇప్పుడున్న విద్యార్థులందరూ మేథావులు కాకపోవచ్చు. కానీ వారు ఏ రంగంలో కెళ్లినా విజయం సాధించాలని ప్రతి తల్లిదండ్రులు, గురువులు కోరుకుంటారు. కానీ విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొన్న తల్లిదండ్రులు కొందరు తెలిసి..మరికొందరు తెలియక తప్పులు చేస్తుంటారు. ఇలా వీరు చేసే తప్పుల వల్ల విద్యార్థులపై జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కొందరు మంచివారిగానూ..మరికొందరు చెడ్డారిగానూ తయారవుతున్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని ఎవరూ పూర్తిగా తీర్చిదిద్దలేరు. కానీ తల్లిదండ్రులు మాత్రం వారి జీవితాలను మార్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేయాలి. అయితే తల్లిదండ్రుల్లో ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలి? వారితో ఎలా ప్రవర్తించాలి?
ఒక కుటుంబంలో ఎన్నో పనులు ఉంటాయి. భార్యభర్తలు ఆ పనులను షేర్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంట్లో వ్యవహారాలన్నీ ఆడవారు చూసుకుంటారు. సంపాద, ఇతర వ్యవహారాలను మగవారు బాధ్యత తీసుకుంటారు. కానీ ఇద్దరు పిల్లలు ఉండి.. వారిలో ఒకరు ఆడ, మరొకరు మగ అయితే వీరి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరు ఎవరిని ప్రేరింపించవచ్చు? చాలా మంది పిల్లల్లో ఆడవారికి నాన్న అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. మగపిల్లలు అమ్మతో ఎక్కువగా ఉంటారు. కానీ మగపిల్లల బాధ్యత నాన్నపైనే ఉంటుంది. ఆడపిల్లల బాధ్యత తల్లిపైనే ఉంటుంది.
ఒక పిల్లవాడు స్కూల్లో ర్యాంక్ తెచ్చుకుంటే.. ఆయన పలానా రామారావు కొడుకు మరి.. అని గొప్పలు చెప్పుకుంటారు. అదే ఆ పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే ‘ఇలాంటి కొడుకును కన్నావేంటి?’ అని ఆడవారిని నిందిస్తుంటారు. మగవారు ఇలా ప్రవర్తించడం వల్ల ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. ఇలా భార్యభర్తలు మధ్య తగువులో మధ్యలో పిల్లాడి జీవితం అడ్డదిడ్డంగా మారుతుంది. అలా కాకుండా తండ్రి బాధ్యతతో ఉండి పిల్లాడు తప్పు చేస్తే సర్ది చెప్పాలి. అయినా వినకపోతే దండించాలి. దండించే విషయంలోనూ కొందరు తల్లులు అడ్డం వస్తారు. కానీ పిల్లాడి జీవితం ఇప్పుడు చక్కగామార్చకపోతే భవిష్యత్ లో బాధపడాల్సి వస్తుంది.
ఇక ఆడపిల్లలకు నాన్న అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కానీ ఈమె బాధ్యత తల్లి తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇంట్లోనే అమ్మ వద్ద ఉండడం వల్ల ఆమె ఏం చేస్తున్నదీ? ఎలా ప్రవర్తిస్తున్న విషయం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. భవిష్యత్ లో ఏదైనా తప్పిదం జరిగితే తనే బాధ్యత అని అనుకోవాలి. అంతేగానీ తనకు మీరంటేనే ఇష్టం.. మీ గారభం వల్లే ఇలా తయారైందని భర్తను నిందించడం కరెక్ట్ కాదు. అయితే కొన్ని విషయాల్లో ఇద్దరూ బాధ్యతతో వ్యవహరించాలి.
కుటుంబంలో ఎన్ని విషయాలు జరిగినా పిల్లల విషయంలో మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించడం చాలా అవసరం. ముఖ్యంగా మగవారు ఉద్యోగానికి, వ్యాపారానికి బయటికి వెళ్లినప్పుడు ఇంట్లో పిల్లల విషయంలో తల్లి కేర్ తీసుకోవాలి. వారి సందేహాలను తీర్చాలి. ప్రతీసారి ప్రశ్నలు వేస్తున్నారని విసిగించుకోకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు పిల్లలను సక్రమ మార్గంలో తీర్చి దిద్దే ప్రయత్నం చేయాలి.