Fridge:ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉందంటే నమ్ముతారు. సిటీలోనే కాదు పల్లెటూరులో కూడా చాలా మంది ఫ్రిజ్ లను ఉపయోగిస్తున్నారు. వారానికి ఒకరోజు మార్కెట్ లు ఉండే పట్టణాల కంటే తాజా కూరగాయలు ఎప్పటికప్పుడు దొరికే పల్లెటూర్లలో కూడా ఫ్రిడ్జ్ లు రాజ్యమేలుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఫ్రిడ్జ్ లలో రకరకాల మోడల్స్ ఉన్నాయి. సింగల్ డోర్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్ లలో ఫ్రీజర్ సపరేట్ గా ఉంటుంది. ఇక డబుల్ డోర్ అయితే సపరేట్ గా ఫ్రీజర్ పైన ఉంటుంది.
ఈ రెండింటిలో ఏది కొనాలి అనేది మన ఛాయిస్. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ రెండు ఫ్రిడ్జ్ లలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కానీ ఫ్రిడ్జ్ లు మాత్రం రెండు రకాలు ఉంటాయి. డైరెక్ట్ కూల్, ఫ్రాస్ట్ ఫ్రీ అని రెండు ఉంటాయి. ఈ డైరెక్ట్ ఫ్రిడ్జ్ లు తక్కువ ధరలోనే లభిస్తాయి. ఎక్కువ మంది వీటినే వాడుతుంటారు. ఇందులో టెంపరేచర్ ను మాన్యువల్ గా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజర్ లో ఒకసారి టెంపరేచర్ సెట్ చేస్తే చాలు కంటిన్యూ అవుతుంది.
కూలింగ్ ఎక్కువ అవడం వల్ల గడ్ట కడితే బటన్ ప్రెస్ చేసి వాటిని కరిగించాల్సిందే. ఈ ఐస్ గడ్డలను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేదంటే ఓవర్ ఫ్లో అవుతూ ఫ్రిడ్జ్ నుంచి బటయకు వచ్చి ఫ్లోర్ మీద పడుతుంది. ఇక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లలో ఈ సమస్య ఉండదు. ఇందులో టెంపరేచర్ కంట్రోల్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులపై కూడా టెంపరేచర్ కంట్రోల్ ఉండటం వల్ల సమస్య రాదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరగాయలు, ఫుడ్ కి తగినట్టు ఈ టెంపరేచర్ సెట్ అవుతూ వాటిని పాడవ్వకుండా చేస్తుంది.
ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లలో గడ్డలు కట్టే సమస్య ఉండదు. ఐస్ క్యూబ్స్ కోసం ప్రత్యేకమైన చోటు ఉంటుంది. మరి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లే మంచిది అంటారు యూజర్లు. సో రెండు బెటర్ కాబట్టి మీ స్థోమతకు తగ్గట్టు, మీ ఆదాయాన్ని బట్టి ఇలాంటి వాటిని కొనుగోలు చేయడం ఉత్తమం. లేదంటే డబ్బులు వృధా అవుతుంటాయి.