Bhuvan Bam: చాలా చిన్న స్థానం నుంచి గొప్ప స్థానానికి ఎదిగిన వారు ఎందరో ఉంటారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే రేంజ్ కు కూడా ఎదుగుతారు. ఒకప్పుడు వారి కష్టం గురించి తెలుసుకుందాం అనుకున్నా కూడా కష్టమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఆ కోవకు చెందిన వారే. ఒకప్పుడు ఆయన అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆయన లైఫ్ అందరికీ ఇన్సిఫిరేషన్. కేవలం యూట్యూబ్ వీడియోల వల్ల అనుకోని విధంగా ఫేమస్ అయ్యారు.
ఇతని పేరే భువన్ బామ్. ముందుగా ఢిల్లీలోని మొఘలాయి రెస్టారెంట్ లో పనిచేస్తూ చదువుకున్నాడు. జనవరి 22వ తేదీ 1994లో గుజరాత్ లోని, వడోదరలో ఉన్న ఒక మరాఠీ ఫ్యామిలీలో ఈయన పుట్టారు. తర్వాత కుటుంబం మొత్తం ఢిల్లీకి చేరుకుంది. అక్కడే భువన్ కూడా చదువుకున్నారు. అయితే అనుకోని విధంగా కోవిడ్ రావడం ఇద్దరు తల్లిదండ్రులు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బీబీకి వైన్స్ పేరుతో చేసిన వీడియోల ద్వారా ఈయన బాగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఈయనకు ఫుల్ ఫ్యాన్స్ కూడా వచ్చారు.
కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తూ ఫేమస్ అయ్యారు. భువన్ సమీర్ ఫడ్డీ, బాంచోద్ దాస్, బబ్లు, జాంకీ, శ్రీమతి వర్మ, పాప మాకిచు, మిస్టర్ హోలా, డిటెక్టివ్ మాంగ్లూ, బబ్లీ సర్, డాక్టర్ సహగల్ వంటి అనేక పాత్రల ద్వారా యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యారు. టెడ్ టాక్స్ లో కూడా మాట్లాడి తన కథను వివరించారు ఈ భువన్. ఆ తర్వాత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ముందుగా తల్లిదండ్రి గురించి అడిగారు. కానీ నిజం తెలియడంతో ఈయన ఎదిగిన తీరుకు అందరూ కొనియాడారు.
ప్లస్ మైనస్ అనే ఒక షార్ట్ ఫిలిం ద్వారా ఈయనకు మంచి నటుడిగా పేరు వచ్చింది. ఇందులో దివ్య దత్తాతో కలిసి నటించారు. ఇక 2023లో తాజా ఖబర్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించారు. నటన మాత్రమే కాదు దీనికి నిర్మాతగా కూడా వ్యవహరించారు భువన్. ఈ సిరీస్ పెద్ద హిట్ ను అందుకుంది. దీనికి రెండవ సీజన్ కూడా ఉంది. మొత్తం మీద ఈయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.