Dog Attack: జీవితంలో కచ్చితంగా ప్రతి వ్యక్తి వెనుక ఒక్క సారి అయినా సరే కుక్క వెంటపడుతుంది కదా. కొన్ని సార్లు ఒక కుక్క లేదా కుక్కల గుంపు అకస్మాత్తుగా వెనక పడుతుంది. అప్పుడు ఎవరు అయినా గందరగోళానికి గురి అవుతారు. అప్పుడు ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాదు. దీంతో ఎవరైనా సరే వేగంగా పరుగెత్తుతుంటారు. ఎంత పరుగెత్తినా సరే కొన్నిసార్లు కుక్కలు మాత్రం పట్టువదలకుండా వెనకపడుతాయి. మరి ఇంతలా భయపెట్టడానికి, దూకుడుగా వాటిని మార్చడానికి కారణం ఏంటి? ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? అనే విషయాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి మరీ కరుస్తుంటాయి కుక్కలు. అయితే ఇవి ఇలా చేయడానికి ప్రధాన కారణం అవి తీసుకునే ఆహారంలో అసమతుల్యత అంటున్నారు నిపుణులు. మానవ జనాభా పెరుగుతున్నట్టే కుక్కల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ కుక్కలు ఉండటానికి ప్లేస్ మాత్రం తగ్గుతోంది. అందుకే ఆ ప్రాంతాన్ని రక్షించడం కోసం అవి అభద్రతా భావాన్ని కలిగిస్తుంటాయట. అందుకే ప్రాణాంతకంగా మారుతాయి కుక్కలు. వాటి ప్రాంతంలోకి మనుషులు వస్తున్నారని అనుకుంటే దూకుడుగా మారి ప్రజలను వెంబడించి కొరుకుతుంటాయి.
కుక్కలు వెంబడిస్తున్నప్పుడు మనుషులు పరుగెత్తడం లేదా భయంతో నడవడం వంటివి చేస్తే దాన్ని ఒక ఆట మాదిరి అనుకుంటాయట. అందుకే మరింత ఎక్కువ చేస్తాయి అంటున్నారు నిపుణులు.అలాంటప్పుడు కొన్నిసార్లు కుక్కలు మనుషులను కురుకే అవకాశం కూడా ఉంటుంది. అయితే, చాలా సమయాల్లో, మనిషి పరుగెత్తేటప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతే, కుక్కలు వెనక్కు తగ్గుతుంటాయి అంటున్నారు నిపుణులు. అయితే రేబిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదట, సైలెంట్ రేబిస్. అంటే ఇవి కుక్క శరీరంలోని నరాలు విశ్రాంతి తీసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ శునకాలు అనారోగ్యం బారిన పడతుంటాయట. తర్వాత పక్షవాతం వచ్చి నాలుగు రోజులకే చనిపోతుంటాయి.
రెండో రకంలో కుక్క చనిపోవడానికి 10 రోజుల వరకు పడుతుంది. ఇలాంటి సమయంలో కుక్కలు చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంటాయి.అప్పుడు అవి ఆహారాన్ని కూడా మింగవు. వాటి నోట్లో లాలాజలం వస్తుంటుంది. కుక్కల మెడలోని నరాలకు పక్షవాతం వస్తుంది. అలాంటప్పుడు అవి మనుషులను కరుస్తుంటాయి. అయితే కుక్క వెంబడించినప్పుడు ఎక్కువ గందరగోళానికి గురి అవకూడదు. ఈ సమయంలో కుక్క కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
కుక్క కాటు నుంచి బయటపడాలంటే ముందుగా భయపడకూడదు. ఈ విషయంలో మనుషుల కంటే కుక్కలు తెలివైనవిగా ఉంటాయట. వ్యక్తి భయపడుతంటే అవి వెంటనే గ్రహిస్తాయి. భయపడి పరుగెత్తెత్తి మిమ్మల్ని మరింత వెంబడిస్తాయి. కుక్క వెంబడించినప్పుడు ధైర్యాన్ని కూడగట్టుకుని, వెనుకకు తిరగండి , దూకుడుగా ఉన్న కుక్కను భయపెట్టడానికి మీరు ప్రయత్నించండి. మీరు ఇలా చేసినప్పుడు, చాలా కుక్కలు పారిపోతాయి. మీరు కుక్కను కొట్టడానికి సమీపంలోని రాయి, ఇటుక లేదా కర్రను తీస్తే అవి భయపడి వెంటనే పారిపోతుంటాయి. చాలా సార్లు ఇలాంటివి మీరు గమనించే ఉంటారు.
మొరుగుతూ ఒక కుక్క మీ వైపు వస్తే అక్కడే వెంటనే ఆగిపోండి. భయపడకుండా ఒక చోట నిల్చోండి. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. మొదట, కుక్క ప్రతి కదలిక గురించి మీకు తెలుస్తుంటుంది. రెండవది, మీరు కుక్కను భయపెట్టడానికి సాధ్యం అవుతుంది. లేదంటే మీ నడక వేగాన్ని తగ్గించండి. కుక్కలు వెంబడించవు. మీరు ఎంత స్పీడ్ గా వెళ్తే అవి అంతే స్పీడ్ గా మీ వద్దకు వస్తాయి. కుక్క పరుగెత్తుతున్నప్పుడు అది ఆగితే దాని కళ్లలోకి నేరుగా చూడవద్దు. ఇలా చేస్తే మరింత దూకుడుగా బిహేవ్ చేస్తాయి.