https://oktelugu.com/

Actor Rahul: నిజంగానే ‘టైసన్’ లా మారిపోయాడు.. హ్యపీడేస్ హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

2007 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘హ్యాపీడేస్’ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, గాయత్రీ రావు, రాహుల్, సోనియా దీప్తి తదితరులు నటించారు. వీరంతా ఆ సమయంలో ఇండస్ట్రీకి కొత్త వారే.

Written By:
  • Srinivas
  • , Updated On : August 8, 2024 / 04:49 PM IST

    Actor Rahul

    Follow us on

    Actor Rahul: ఒక సినిమా తీయాలంటే కొందరు డైరెక్టర్లు అనుభవం ఉన్న నటులను ఎంపిక చేసుకుంటారు. కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువైనా పర్వాలేదు సీనియర్లతో తీస్తే సినిమా అనుకున్న విధంగా వస్తుందని అనుకుంటారు. కానీ శేఖర్ కమ్ముల లాంటి డైరెకర్లు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. దాదాపు ప్రతీ సినిమాలో కొత్త వారిని పరిచయం చేస్తూ.. ఆ సినిమాను విజయం వైపు తీసుకెళ్లాడు. ఒకప్పుడు శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభ అయిందని తెలియగానే చాలా మంది యూత్ ఆ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేసేవారు. అందుకు అనుగుణంగానే ఈ లవ్లీ డైరెక్టర్ యూత్ కు నచ్చే విధంగా సినిమాలు తీసేవాడు. అలా ఆయన మదిలో నుంచి వచ్చిన మంచి పాప్ కార్న్ మూవీ ‘హ్యాపీడేస్’. ‘ఒక స్టూడెంట్ ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఇంజనీరింగ్ కాలేజీలోనే.. ఈ లైఫ్ అతని జీవితాన్ని మార్చేస్తుంది.. ఈ కాలంలో ఎంజాయ్ మెంట్ తో పాటు ఎమోషన్ష్ కూడా ఉంటాయి..’ అని వివరిస్తూ శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచాడు. అనుకున్నట్లుగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు కొట్టింది. ఇప్పటీకి కొన్ని కళాశాలల్లో ఈ మూవీ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా సక్సెస్ తో ఇందులో నటించిన జీవితాలు మారిపోయాయి. వీరిలో కొందరు స్టార్లు కాగా..మరికొందరు మాత్రం కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత వేరే రంగంలో సెటిలయ్యాయి. వీరిలో ‘టైసన్’ పాత్ర గురించి అప్పటి కిడ్స్ కు బాగానే గుర్తుంటుంది. ఆ టైసన్ ఇప్పుడు రీసెంట్ గా ఓ సినిమాలో కనిపించాడు. ఆయన ఎలా ఉన్నాడంటే?

    Actor Rahul(1)

    2007 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘హ్యాపీడేస్’ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, గాయత్రీ రావు, రాహుల్, సోనియా దీప్తి తదితరులు నటించారు. వీరంతా ఆ సమయంలో ఇండస్ట్రీకి కొత్త వారే. అయితే వీరిలో రాహుల్-సోనియా దీప్తి జోడి చేసే సందడి మాములుగా ఉండదు. రాహుల్ టైసన్ పాత్రలో అద్భుతంగా నటించారు. బక్కపలచని శరీరంతో కళ్లజోడు పెట్టుకొని సన్నగా మాట్లాడుతూ సీనియర్ అమ్మాయి సోనీని లవ్ చేస్తూ ఉంటాడు. వీరి మధ్య జరిగే సీన్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఆ తరువాత రాహుల్ అసలు పేరు మరిచి అతనిని టైసన్ అని పిలవడం ప్రారంభించారు.

    ఈ సినిమా తరువాత ఇందులోని దాదాపు అందరూ మళ్లీ సినిమాల్లో నటించారు. కానీ రాహుల్ మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. దీని తరువాత రెయిన్ బో, ప్రేమ ఒక మైకం, లవ్ యూ బంగారం, ముగ్గురు అనే సినిమాల్లో నటించారు. కానీ ఏదీ హిట్టుకాలేకపోవడంతో టైసన్ కు మంచి బ్రేక్ ఇవ్వలేదు. దీంతో కొన్ని సినిమాల్లో ఏ అవకాశం వచ్చినా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ తరువాత 2017లో వెంకటాపురం అనే సినిమాలో కనిపించాడు. చాలా రోజుల బ్రేక్ తీసుకున్న ఆయన ఇప్పుడు లేటేస్టుగా ‘భజే వాయు వేగం’ సినిమాలో కనిపించాడు. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించి మెప్పించాడు.

    అయితే హ్యపీడేస్ సినిమా సమయంలో రాహుల్ టైసన్ కు వ్యతిరేకంగా బక్కపలచని శరీరంతో కనిపించాడు. అందుకే అతనిని టైసన్ పేరుతో ఏడిపిస్తారు. కానీ ఆయన ఇప్పుడు నిజంగానే టైసన్ లా మారిపోయాడు. శరీరాకృతిని క్రమంగా పెంచుకుంటూ ఫిట్ గా మారిపోయాడు. దీంతో ఆయన లేటేస్ట్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రాహుల్ లేటేస్టుగా నటించిన ‘భజే వాయు వేగం’ హిట్టుగా నిలిచింది. మరి ఇప్పటికైనా ఆయనకు అవకాశాలు పెరుగుతాయా? లేదా? చూడాలి.