Heart Disease: ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. డెబ్బయి ఏళ్లకు రావాల్సిన గుండెపోటు ముప్పై నలబై ఏళ్లకే వస్తోంది. ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె జబ్బులకు కేంద్రంగా మన భారతదేశమే నిలుస్తోంది. దీంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. ఎందుకు మన దగ్గరే ఇలా అవుతోంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారమే. ఆడవారి కంటే మగవారికే గుండెపోటు ఎక్కువగా వస్తోంది. దీంతో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఏ జంతువుకు రాని జబ్బులు మనిషికే ఎందుకొస్తున్నాయి. మనిషి తీసుకునే ఆహారమే శాపంగా మారుతోంది. గుండె జబ్బులు రావడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

గుండె జబ్బు రావడానికి ప్రధాన కారణం మధుమేహం, రక్తపోటు. ఈ సమస్యలతో బాధపడేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటితో బాధపడే వారిలో ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బు వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే నిరంతరం షుగర్, బీపీ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. వైద్యులను సంప్రదించాలి. రక్తపోటుతో అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. దీంతో మనం ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడితేనే మంచిది. లేదంటే ప్రమాదం ఎలా వస్తుందో కూడా తెలియదు.
మద్యపానం, ధూమపానం రెండు కూడా ప్రమాదకరమే. వీటిని తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువే. షుగర్, బీపీ ఉన్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇవి గుండె ధమనులను, రక్తనాళాలకు హాని కలిగిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం క్రమంగా దెబ్బతినే వీలుంది. ఈ రెండు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం. ఈ అలవాట్లు మానుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. మధుమేహం, రక్తపోటు బాధితులు సాధ్యమైనంత వరకు వీటిని తీసుకోకండి.

ఒత్తిడి కూడా రక్తపోటును పెంచుతుంది. వీలైనంత వరకు ఒత్తిడిని దరి చేరనీయొద్దు. ప్రశాతంగా ఆలోచించాలి. మంచి ఆలోచనలతో ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక బరువు కూడా అంత మంచిది కాదు. బరువు పెరుగుతుంటే మనకు జబ్బులు పెరుగుతాయి. అందుకే బరువును అదుపులో ఉంచుకోకపోతే గుండె జబ్బులు సోకే ప్రమాదం ఉంది. ఆయిల్ ఫుడ్ కు కూడా దూరంగా ఉండాలి. నూనె లేని పదార్థాలు తీసుకుంటేనే ప్రయోజనం. ఆయిల్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గుండెపోటుకు దారి తీస్తుంది.
నిద్ర కూడా అవసరమే. రోజుకు కనీసం ఏడెనిమిది గంటలైనా నిద్ర పోవాలి. అప్పుడే మన అవయవాలు ప్రశాంతంగా ఉంటాయి. దీంతో మనకు రోగాలు రాకుండా ఉండేందుకు సహకరిస్తాయి. కానీ వాటికి సరైన విశ్రాంతి లేకపోతే అవి పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంది. దీంతో మనం జాగ్రత్తలు తీసుకుని మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసర ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.