Sobhan Babu: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు సినిమా వస్తుంది అంటే చాలామంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసేవారు. ఆయన సినిమాలో ఏదో ఒక కొత్త అంశమైతే ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక శోభన్ బాబు చేసిన చాలా సినిమాల్లో ఆయనతో పాటు ఆడిపాడటానికి ఇద్దరు హీరోయిన్లు ఉండేవారు. అయితే ఇద్దరు హీరోయిన్లు ఎందుకు అనే ఆలోచన అప్పట్లో అందరిలో వచ్చింది.
కానీ శోభన్ బాబు హీరోగా వస్తున్నాడు అంటే ఆయనకి ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అనే ఒక అభిప్రాయానికి ప్రేక్షకులు కూడా వచ్చేసారు అంటే ఆ విషయం ప్రేక్షకుల మీద ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు.శోభన్ బాబు సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు అని అంటే ఒకరితో ప్రేమాయానాలను నడిపిస్తూనే, మరొకరితో రిలాక్సేషన్ కోసం సాంగ్స్ ని గాని లేదా ఆమె నుంచి ఎదురయ్యే ప్రేమవల్ల జనరేట్ అయ్యే కామెడీని కానీ హైలెట్ చేస్తూ దర్శకుడు సినిమా మొత్తాన్ని నడిపిస్తూ ఉండేవాడు. అందుకే అప్పట్లో దర్శకులు ఆయన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను పెడుతూ ఉండేవారట.
ఇక దానికి తగ్గట్టుగానే ఇద్దరు హీరోయిన్లు ఉండటం వల్ల సినిమా మొత్తం చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అలాగే హీరోయిన్లు కూడా చాలా అందంగా కనిపిస్తూనే తలుక్కున మెరిసేవారని చాలా మంది సినీ ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు. అయితే శోభన్ బాబు అప్పట్లో ఫ్యామిలీ స్టార్ గా తనకంటూ ఉన్న గుర్తింపును కాపాడుకుంటూ చివరి వరకు కూడా సోగ్గాడిగా తనకున్న ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చాడు.
ఇక ఆయన అభిమానులకు తను ఎప్పటికీ హీరో గానే ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా తను ఒక్క సినిమాలో కూడా నటించకుండా హీరోగా ఉన్నపుడే రిటైర్మెంట్ ప్రకటించాడు…అలా చేసిన ఏకైక హీరో కూడా శోభన్ బాబే కావడం విశేషం…