Varalakshmi Vratham 2022: శ్రావణ మాసమంటేనే పూజల సందడి. భక్తిభావంతోనే నెలంతా గడుపుతారు. వ్రతాలు, పూజలతో మహిళలు ఉపవాసాలు చేస్తారు. ఈ నెలలోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతంలో మహిళలు ముత్తయిదువులను పిలిచి వాయనాలు ఇచ్చుకుంటూ వారిని సంతోష పరుస్తారు. తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు. చుట్టుపక్కల వారిని పిలిచి వారితో పూజ ఘనంగా నిర్వహిస్తారు. కలశాన్ని అమ్మవారిగా భావించి పసుపు, కుంకుమలతో పూజ చేసి తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు.

వరలక్ష్మి వ్రతం కోసం పూర్వం రోజుల్లో ఏ సదుపాయాలు లేకున్నా ఇప్పుడు అన్ని వచ్చాయి. రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. అమ్మవారి ప్రతిమలు, చీరలు, నగలు, వంకీలు, వడ్డానాలు అన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి. దీంతో ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలంటే అలాగే చేసుకోవచ్చు. రెడీమేడ్ వస్తువులతో అందంగా అలంకరించుకోవచ్చు. అమ్మవారి ప్రతిమలతో చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇందుకు గాను అన్ని రకాల వస్తువులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి.
Also Read: Bimbisara Twitter Review: బింబిసార ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ ఎలా ఉందంటే?
వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. శ్రావణమాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే అన్ని రకాల మేలు జరుగుతుందని మనవారి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ వ్రతాన్ని ఆచరించేందుకు మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. తమ కుటుంబ శ్రేయస్సు కోసం వ్రతం చేస్తూ మనసారా వేడుకుంటారు. ఏ బాధలు లేకుండా తమ జీవితం సాగిపోవాలని కోరుకుంటారు. ఇందుకోసం వరలక్ష్మి వ్రతం చేయడం తెలిసిందే. మహిళలకు ఇష్టమైన వ్రతంగా కూడా దీనికి గుర్తింపు ఉంది.

వరలక్ష్మి వ్రతాన్ని పీఠమీద కలశం పెట్టి దానిపై కొబ్బరికాయను ఉంచి పూజలు చేస్తారు. వెనుక లక్ష్మిదేవి ఫొటో పెట్టి మహిళలు శ్లోకాలతో అభిషేకిస్తారు. వరలక్ష్మి వ్రతం చేయడం అదృష్టంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వత్రం చేయడం ఆనవాయితీ. దీంతో మహిళలు తమ కుటుంబ సంక్షేమం కోసం ఈ వ్రతం చేస్తుంటారు. ఈనేపథ్యంలో అందరి లోగిళ్లు అందంగా అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరించి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తుంటారు.
Also Read:National Flag : జాతీయ జెండా ఎలా మడవాలి? ప్రభుత్వం సూచనలివీ?