Homeఎంటర్టైన్మెంట్Amardeep- Tejaswini Engagement: అమర్ దీప్, తేజస్విని ఎందుకు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు?

Amardeep- Tejaswini Engagement: అమర్ దీప్, తేజస్విని ఎందుకు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు?

Amardeep- Tejaswini Engagement: ఏ రంగానికి చెందిన వారు ఆ రంగంలో ఒక్కటి కావడం తెలిసిందే. సినిమా పరిశ్రమలో చాలా మంది పెళ్లిళ్ల చేసుకున్న వారు ఉన్నారు. అదేవిధంగా బుల్లితెర నటులు కూడా అలాగే చేసుకుంటుంటారు. ఇందులో పెద్ద విచిత్రమేమీ లేదు. కానీ సీక్రెట్ గా చేసుకోవడంతోనే చిక్కొచ్చి పడింది. పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు దాపరికం. ఎప్పుడైనా బయట పడాల్సిందే కదా. ఈ నేపథ్యంలో ఓ బుల్లితెర జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. దాన్ని బిగ్ బాస్ బ్యూటీ బయటపెట్టడం గమనార్హం.

Amardeep- Tejaswini Engagement
Amardeep- Tejaswini

జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కన్నడ పరిశ్రమకు చెందిన తేజస్వినిని వివాహం చేసుకోబోతున్నాడు. దీనికి గాను నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కానీ ఈ విషయం ఎవరికి తెలియనివ్వలేదు. రహస్యంగా కానివ్వాలని అనుకున్నాడు. బిగ్ బాస్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో వైరల్ అయింది. అంతవరకు ఎవరికి తెలియదు. అంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో అనే ప్రశ్నలు వస్తున్నాయి.

Also  Read: Bimbisara Twitter Review: బింబిసార ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ ఎలా ఉందంటే?

తేజస్విని కోయిలమ్మ సీరియల్ లో చిన్ని పాత్ర ద్వారా తెలుగు వారికి పరిచయమైన ఈమె కేరాఫ్ అనసూయ సీరియల్ లో కూడా నటిస్తోంది. ఇక వీరిద్దరి ప్రేమ విషయం కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నిశ్చితార్థం కూడా గుట్టుచప్పుడు కాకుండా జరిపుకునేందుకు ఇష్టపడ్డారు. ఎవరైనా పెళ్లి అంటే అందరికి చెప్పుకుంటారు. కానీ వీరు మాత్రం ఎవరికి తెలియద్దనుకోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓ బుల్లితెర జంట ఒక్కటి కాబోతోంది.

Amardeep- Tejaswini Engagement
Amardeep- Tejaswini

ఇటీవల కాలంలో ప్రేమ విషయంలో రహస్యాలు పాటిస్తున్నా పెళ్లి విషయంలో మాత్రం అందరికి చెప్పి చేసుకుంటున్నారు. కానీ వీరు మాత్రం ఎవరికి తెలియకుండా చేసుకోవాలని అనుకోవడంపై అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి చేసుకునేదే. అందుకే అంత హడావిడి చేస్తారు. బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరి సమక్షంలోనే తాళి కట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమర్ దీప్, తేజస్వినిలు ఎందుకు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

Also  Read:Vikrant Rona Collections: తెలుగు తెర పై భారీ కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమా.. ఇది సరికొత్త రికార్డ్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version