https://oktelugu.com/

What is Micro cheating: మైక్రో చీటింగ్ అంటే ఏమిటి? దీనివల్ల బంధం విరిగిపోతుందా?

కొందరు భాగస్వామి బాధపడతారని లేకపోతే చెప్పకూడదని కొన్ని విషయాలను దాచేస్తారు. దీనినే మైక్రో చీటింగ్ అంటారు. కొందరు భాగస్వామికి తెలియకుండా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటారు. వాళ్లతో బయటకు వెళ్లడం, సినిమాలకు వెళ్లడం, ఎక్కువగా చాటింగ్, కాల్స్ వంటివి చేస్తుంటారు

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 7, 2024 / 11:59 AM IST

    What-is-micro cheating

    Follow us on

    What is Micro cheating: ఈ మధ్య కాలంలో రిలేషన్‌లోకి వెళ్లడం కంటే వాటిని కాపాడుకోవడంలోనే సగం జీవితం అయిపోతుంది. ఎందుకంటే ఎంతో ఇష్టపడి, ఇంట్లో అందరిని ఒప్పించి మరి పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లయిన తర్వాత విడాకుల బాట పడుతున్నారు. అదే రిలేషన్‌లో ఉన్నవారు.. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న కూడా చిన్న కారణాలతో విడిపోతున్నారు. ఈరోజుల్లో భాగస్వాములు ఎక్కువగా మోసం చేస్తున్నారు. మోసం అంటే ఏదో పెద్ద మోసం కాదండోయ్.. చాలా చిన్న మోసం. ఇలాంటి చిన్న మోసాలే కొందరి జీవితాలని నాశనం చేస్తాయి. ఈరోజుల్లో చాలామంది బంధంలో మైక్రో చీటింగ్‌లు చేస్తున్నారు. తెలిసో తెలియక చేసిన ఈ మైక్రో చీటింగ్ చేస్తున్నారు. బంధంలో జరిగే చిన్న తప్పుల వల్ల వల్ల కొన్నిసార్లు విడిపోతారు. అయితే చాలా మందికి ఈ మై్క్రో చీటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. మరి ఈ మైక్రో చీటింగ్ అంటే ఏమిటి? ఈ చీటింగ్ వల్ల బంధంలో ఎలాంటి తప్పులు వస్తాయో ఈ రోజు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

    బంధంలో సమస్యలు వస్తాయా?
    కొందరు భాగస్వామి బాధపడతారని లేకపోతే చెప్పకూడదని కొన్ని విషయాలను దాచేస్తారు. దీనినే మైక్రో చీటింగ్ అంటారు. కొందరు భాగస్వామికి తెలియకుండా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటారు. వాళ్లతో బయటకు వెళ్లడం, సినిమాలకు వెళ్లడం, ఎక్కువగా చాటింగ్, కాల్స్ వంటివి చేస్తుంటారు. కానీ ఈ విషయం భాగస్వామికి తెలియకుండా మ్యానేజ్ చేస్తారు. ఇలాంటి మోసాలు వల్ల బంధం విడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం భాగస్వామికి తెలిస్తే బాధపడతారని చెప్పకుండా దాచేస్తారు. కానీ అదే విషయం ఎప్పుడైనా తెలిస్తే.. వాటివల్ల ఇద్దరి మధ్య గొడవలు మాత్రం తప్పవు. ఇవి చిన్నగా ప్రారంభమైన చివరికి విడిపోయే స్టేజ్‌ వరకు తీసుకెళ్తాయి. కొందరు ఇంట్లో కంటే ఆఫీస్‌లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆఫీస్‌లో ఇతరులతో క్లోజ్‌గా ఉంటారు. వేరే వాళ్లతో తప్పుడు రిలేషన్ ఉండదు. కానీ ఇలా సన్నిహితంగా ఉన్నట్లు భాగస్వామికి తెలియకూడదని భావిస్తారు. తెలిస్తే ఫీల్ అవుతారనే ఉద్దేశంతోనే చేస్తారు.

    చీటింగ్ చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా?
    మైక్రో చీటింగ్ చేసేవారు భాగస్వామికి దూరంగా గడుపుతారు. భాగస్వామికి కనీసం సమయం ఇవ్వకుండా మొబైల్‌లో ఉండే మీరు సందేహ పడాల్సిందే. కొందరు భాగస్వామి పక్కన ఉన్నా కూడా మొబైల్‌లో చాటింగ్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడుకోవడం వంటివి చేస్తుంటారు. అలాగే ఆఫీస్ ఫంక్షన్‌కి భాగస్వామిని తీసుకెళ్లడానికి ఇష్టం లేకపోవడం, సరదాగా బయటకు తీసుకెళ్లకపోవడం వంటివి చేస్తుంటారు. భాగస్వామిని కాకుండా వేరే వాళ్లను బయటకు తీసుకు వెళ్తే.. మైక్రో చీటింగ్ చేస్తున్నారని గుర్తించవచ్చు. కొందరి ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇలా ఎప్పుడూ జరిగితే చీటింగ్ చేస్తున్నారని భావించవచ్చు. ఈ రోజుల్లో కొందరు ఆన్‌లైన్‌లో ఉంటారు. కానీ భాగస్వామితో చాట్ చేయరు. ఇతరులతో చేస్తుంటారు. ఇలా మీ భాగస్వామి ప్రవర్తిస్తున్నట్లయితే తప్పకుండా మైక్రో చీటింగ్ చేస్తున్నారని అర్థం చేసుకోండి.