election counting : పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశంలో హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. జమ్మూ కశ్మీర్, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. జమ్మూ కశ్మీర్‌లో భద్రతా కారణాల దృష్టా మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది. పదేళ్ల తర్వాత కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగడంతో భారీగా పోలింగ్ నమోదైంది. పాలకులను ఎన్నుకునేందుకు మూడు విడతల్లోనూ 50 శాతానికిపైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ ఈస్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ఇక హర్యానాలోనూ 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. 1,030 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా 65 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మంగళవారం(అక్టోబర్ 8న) వెలవడనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు కౌటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హర్యానా ఎన్నికల పోలింగ్ ముగిసన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానా హస్తగతం అవుతుందని చాలా సర్వేలు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం ఇవ్వలేదు. హంగ్ ప్రభుత్వం తప్పదన్న సంకేతాలుఇచ్చాయి. హర్యానాలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఇలా..
రెండు రాష్ట్రాలకు సంబందించి పీపుల్స్ పల్స్ సంస్త ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. హర్యానాలో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని తేల్చింది. కాంగ్రెస్‌కు 55 స్థానాలు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 26 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. జేజేపీకి 1, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక అధికార బీజేపీ మాత్రం హ్యాట్రిక్‌పై ఆశలు పెట్టుకుంది.
ఇక జమ్మూ కశ్మీర్‌లో హంగ్ వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. నేషనల్ కాన్ఫరెన్స్–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 90 స్థానాలు ఉన్న కశ్మీర్ అసెంబ్లీలో కూటమికి 46 నంంచి 50 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఎన్డీఏ కూఏటమికి 23 నుంచ 27 సీట్లు వస్తాయని తెలిపింది. పీడీపీకి 7 నుంచి 11 సీట్లు, ఇతరులకు 4 నుంచి 5 సీట్లు వస్తాయని వెల్లడించింది.
ఇక మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ హర్యానాలో అధికారం కాంగ్రెస్‌దేఅని తేల్చింది. 55 నుంచి 62 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. బీజేపీ 12 నుంచి 24 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది.
ఫలితాలపై ఉత్కంఠ..
మరి కొన్ని గంటల్లో హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ గెలుపుపై ధీమాగా ఉంది. బీజేపీ కూడా గెలుస్తామంటోంది. ఆప్ కీలక పాత్ర పోషిస్తామని భావిస్తోంది.