https://oktelugu.com/

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ బడ్జెట్ ఎంతో తెలిస్తే మీ మతి పోతుంది..!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకుడు అన్ని భాషల సినిమాలను చూస్తున్నాడు. దాంతో ఏ సినిమా బాగుంటే ఆ సినిమాను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇక మీదట సినిమాలు చేసే ప్రతి ఒక్క దర్శకుడు చాలా జాగ్రత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది...

Written By:
  • Neelambaram
  • , Updated On : October 7, 2024 / 11:57 AM IST
    Follow us on

    Thug Life: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ ని చూసిన తమిళ్ సినిమా దర్శకులు కూడా కొత్త పంథా లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళు చేస్తున్న సినిమాలు భారీ సక్సెస్ లను సాధిస్తు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఒక మొత్తానికైతే తమిళంలో కూడా చాలా కొత్త కథలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సైతం డిఫరెంట్ సినిమాలతో మరొకసారి మన ముందుకు రాబోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’  అనే సినిమాతో కమల్ హాసన్ ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మణిరత్నం ప్రస్తుతానికి పెద్దగా ఫామ్ లో అయితే లేడు. అలాగే కమల్ హాసన్ కి కూడా విక్రమ్ సినిమాని మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన భారతీయుడు 2 సినిమా కూడా ఫ్లాప్ అయింది.
    మరి ఏ నమ్మకంతో ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మీద 300 కోట్ల బడ్జెట్ ను పెడుతున్నారు. అనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిజానికి సినిమా సక్సెస్ అయితే ఈజీగా ఆ డబ్బులను కలెక్ట్ చేయగలుగుతుంది. కానీ ఒకవేళ తేడా కొడితే మాత్రం ఆ సినిమా భారీగా నష్టాన్ని మిగిల్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
    ఇక రీసెంట్ గా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా దాదాపు 15 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. కాబట్టి కమల్ హాసన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆయన సినిమాకు హిట్టు టాక్ వస్తేనే జనాలు థియేటర్ కి వస్తారు. లేకపోతే మాత్రం ఆ సినిమా చూడడానికి జనాలు థియేటర్ కి రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ తన సినిమాలతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి మణిరత్నం మరొకసారి భారీ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.
    ఇక ఈ సినిమాతో మరోసారి తను బౌన్స్ బ్యాక్ అయ్యి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా అప్పటికి తనను తాను స్టార్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం ఇదే తనకు సరైన సమయం అని భావిస్తున్న మణిరత్నం ఎలాగైనా సరే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు…