Facial : మన ఆహారపు అలవాట్లు, రోజువారీ అలవాట్లు కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి, ప్రజలు వివిధ రకాల పద్దతులను ట్రై చేస్తుంటారు. కొంత మంది మెరుపును తిరిగి తీసుకురావడానికి ఫేషియల్స్ వంటి బ్యూటీ ట్రీట్‌మెంట్లు కూడా చేసుకుంటారు. కొన్ని సార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే రిజల్ట్ మాత్రం ఉండదు. అందుకే ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే నాచురల్ రెమెడీలను ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు. అయితే ఇప్పుడు మనం అలాంటి ఓ చిన్న టిప్ నుచూసేద్దాం. ఇది మీకు మంచి రిజల్ట్ ను అందిస్తుంది. అదే ఐస్ ఫేషియల్. ఇంతకీ ఈ ఐస్ ఫేషియల్ అంటే ఏంటి? ఎలా చేస్తారు అనే వివరాలు ఇప్పుడు మీకోసం.
ఐస్ ఫేషియల్ అనేది చర్మ సంరక్షణా చికిత్స. ఇందులో చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి ఐస్ లేదా ఐస్ క్యూబ్‌లను ఉపయోగిస్తారు. ఐస్ ఫేషియల్ సహాయంతో చర్మ రంద్రాలలో దాగి ఉన్న మురికి, సెబమ్‌ను శుభ్రం చేయడం సులభం. మెరిసే చర్మం పొందడానికి చాలా మంది ఈ థెరపీని చేస్తుంటారు. అయితే ఈ ఫేషియల్ ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?.
చర్మం మంట, చికాకును తగ్గిస్తుంది.
ఐస్ ఫేషియల్ సమయంలో, ఐస్ చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది వాపు, చికాకును తగ్గిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మొటిమల సమస్యలతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐస్ వాపును తగ్గిస్తుంది. మొటిమల సమస్యను నివారిస్తుంది.
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
ఐస్ ఫేషియల్ చర్మంపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ పెరిగినప్పుడు, ఆక్సిజన్, పోషకాలు చర్మంలోకి సరిగ్గా చొచ్చుకుపోతాయి. దీంతో చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ఇది చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.
రంధ్రాలను శుభ్రపరచడం
ఐస్ ఫేషియల్ చర్మ రంధ్రాలను తగ్గిస్తుంది. చర్మంలోని మురికిని తొలగిస్తుంది. ఇది ముఖాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది.
యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్
ఐస్ ఫేషియల్‌లో, ఐస్ చల్లని ప్రభావం చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. ఇది సహజ యాంటీ ఏజింగ్. చర్మం అకాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది.
చర్మం అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది
మీరు ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉంటే లేదా ఎక్కువ గంటలు పని చేస్తుంటే, ఐస్ ఫేషియల్ ముఖ అలసటను తగ్గిస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా, హాయిగా ఉంటుంది.
ఐస్ ఫేషియల్ ఎలా చేయాలి?
ఐస్ ఫేషియల్ చేయడానికి, మీకు ఐస్ క్యూబ్స్, కాటన్ క్లాత్ అవసరం. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్‌లో ఐస్‌ని చుట్టి చర్మంపై నెమ్మదిగా అప్లై చేయాలి. మీరు దీన్ని 5-10 నిమిషాల పాటు చేయవచ్చు.