What is a goal in life: కొందరు తమ జీవితం చాలా హాయిగా ఉండాలని అనుకుంటారు. సమయానికి ఆహారం.. చేతిలో డబ్బులు.. కాలక్షేపం కోసం స్నేహితులు.. కుటుంబ సభ్యులు ఉంటే ఇక తమ జీవితానికి ఇంతే చాలు అని అనుకుంటారు. కానీ కొందరికి వీటిలో కొన్ని ఉండకపోవచ్చు. అయితే కేవలం బంధాలు, ఆప్యాయతలు, స్నేహితులు ఉండడం మాత్రమే జీవితం కాదు. జీవితంలో అత్యున్నత శిఖరానికి ఎదగాలని ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఈ లక్ష్యాన్ని అందరూ చేరుకోపోవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో ఎన్నో విషయాలు తెలుస్తాయి. అయితే కొందరు ఏదో సాధించాలని తపన పడుతూ ఉంటారు. కాని వారు ఏం సాధించాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేక పోతారు. అలా అసలు విషయాన్ని ఏర్పాటు చేసుకునే దానినే గోల్ అంటారు. అంటే జీవితంలో అత్యున్నత సంతోషం పొందాలంటే గోల్ ను అధిగమించాలి. మరో గోల్ అంటే ఏమిటి?
ఒక వ్యక్తి పర్వతాన్ని అధిరోహించాలని అనుకుంటాడు. అందుకోసం అవసరమైన ఏర్పాటు చేసుకుంటాడు. అంటే పర్వతం ఎత్తుకెందుకు ముందుగా ట్రైనింగ్ తీసుకుంటాడు. అలాగే ఎక్కే సమయంలో ఆక్సిజన్ వెంటబెట్టుకుంటాడు. అవసరమైన ఆహారాన్ని తీసుకెళ్తాడు. మొత్తానికి పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ వ్యక్తి పర్వతం ఎక్కాలని గోల్ ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ పర్వతమే అతని గోల్.
Also Read: పెళ్లయిన ఆడవాళ్లు ఎఫైర్స్ పెట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా?
అలాగే జీవితంలో తను ఏ విషయంలో అయితే రాణించాలని అనుకుంటాడు దానిని అధిగమించడానికి ఏర్పాటు చేసుకునేదే గోల్. ఈ గోల్ ను సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఎదురు దెబ్బలు వస్తుంటాయి. అయితే పర్వతం ఎక్కే క్రమంలో ఎలాంటి ఏర్పాటు చేసుకుంటున్నారో.. లక్ష్యాన్ని సాధించే క్రమంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే లక్ష్యాన్ని సాధించడానికి మంచి చదువు కావాలి. క్రమశిక్షణ ఉండాలి. సాధించాలన్న తపన ఉండాలి. మంచి మనసు ఉండాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది.
కానీ చాలామంది నేటి కాలంలో గోల్ అని చెబుతుంటారు. అందుకు అవసరమైన ఏర్పాట్లనే చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఉదాహరణకు ఒక జాబ్ ను సాధించాలనే క్రమంలో ఎంతో కష్టపడతారు. అయితే ఒకటి రెండు సార్లు విఫలం కాగానే ప్రయత్నాలు మానుకుంటారు. మరి కొంతమంది అయితే జాబ్ ప్రయత్నం మానేసి ఇతర వ్యాపారం చేస్తుంటారు. అలాకాకుండా పలుసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే తమ ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేసుకొని తిరిగి ప్రయత్నం చేస్తుండాలి. ఎంత ప్రయత్నిస్తే.. అంత అనుభవం వచ్చి.. మరింత ముందుకు పోగలిగే శక్తి వస్తుంది.
Also Read: ధనవంతుల లాగా నటిస్తున్న మిడిల్ క్లాస్ పీపుల్స్.. ఏం జరగనుందో తెలుసా?
అందువల్ల ఒక వ్యక్తి గోల్ లేదా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దానిని పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు. దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చిన.. ఎవరిని ఇబ్బందులకు గురి చేసిన వెనుకడుగు వేయకూడదు. అయితే ఆ గోల్ అనేది స్పష్టంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి.
View this post on Instagram