Mount Fuji and cherry blossoms: జపాన్ అంటే కేవలం టెక్నాలజీ, బుల్లెట్ ట్రైన్‌లు మాత్రమే అనుకుంటాం. కానీ, ఆ దేశం గురించి మనకు తెలిసిన విషయాల కంటే, తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. జపాన్ సంస్కృతి, అక్కడి ప్రజల జీవనశైలి, ప్రకృతి అందాల గురించి కొన్ని అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుందాం.
జపాన్ ప్రత్యేకతలు
జపాన్ మొత్తం 6,852 దీవులతో ఏర్పడింది. ఇందులో హొన్షు, హొక్కైడో, క్యూషు, షికోకు అనే నాలుగు పెద్ద దీవులు చాలా ముఖ్యమైనవి. భూకంపాల విషయానికొస్తే, జపాన్‌లో ఏడాదికి సుమారు 1,500 భూకంపాలు వస్తాయి. వాటిలో చాలావరకు చిన్నవే అయినా, భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్‌లో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఫుజి. ఇది ఒక క్రియాశీల అగ్నిపర్వతం, జపనీస్ సంస్కృతిలో దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ ఇది.. ఒక్కరోజు బస చేయాలంటే ఆస్తులమ్ముకోవాలి.. అప్పులూ చేయాలి!
రాజధాని టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇక్కడ 37 మిలియన్ల మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. జపాన్‌లో ప్రజల సగటు వయసు 84 సంవత్సరాలు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే దేశాల్లో జపాన్ కూడా ఒకటి. చెర్రీ బ్లోసమ్స్ జపాన్ జాతీయ చిహ్నం. ఈ పూలు వికసించే సమయంలో దేశమంతా అనేక ఉత్సవాలు జరుగుతాయి.
జపాన్ ప్రసిద్ధ వంటకాల్లో సుశి ఒకటి. చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచే పద్ధతిగా ఇది 8వ శతాబ్దంలో పుట్టింది. ఇక రవాణా విషయానికి వస్తే జపాన్ షింకన్‌సెన్, అంటే బుల్లెట్ ట్రైన్‌లకు ప్రసిద్ధి. ఇవి గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. వాటి టైం మెయింటెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.
జపాన్‌లో 80,000 కి పైగా పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. షింటో, బౌద్ధమతం ఇక్కడ ప్రధాన మతాలు. జపాన్‌లో ఒక ప్రత్యేకమైన వెండింగ్ మెషిన్ సంస్కృతి ఉంది. ఇక్కడ 5 మిలియన్ల కంటే ఎక్కువ వెండింగ్ మెషిన్‌లు ఉన్నాయి. స్నాక్స్ నుండి గొడుగుల వరకు అన్నింటినీ ఈ మెషిన్‌ల ద్వారా అమ్ముతారు.
Also read: రాజకీయాల్లోకి మస్క్ ఎంట్రీ.. ఆయన వ్యాపారం ఢమాల్..
జపనీస్ గార్డెన్స్‌లో కనిపించే కోయ్ చేపలను జపాన్ సంస్కృతిలో పట్టుదల, బలానికి ప్రతీకగా భావిస్తారు. అక్కడి ప్రజలు ఫారెస్ట్ బాతింగ్ అంటే ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అడవుల్లో సమయం గడుపుతుంటారు. ఇది జపాన్‌లో ఒక ప్రసిద్ధ పద్ధతి. జపాన్ విద్యావిధానం క్రమశిక్షణ, అందరితో కలిసిమెలిసి ఉండటంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. విద్యార్థులు తమ తరగతి గదులను శుభ్రం చేయడం వారి దినచర్యలో ఓ భాగం.
ఓకినావా అనే దీవి ప్రపంచంలోని బ్లూ జోన్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు సగటు కంటే చాలా ఎక్కువ కాలం జీవిస్తారు. జపనీస్ వాళ్లు మూడు రాత పద్దతులను ఉపయోగిస్తారు. అవి కంజి, హిరాగానా, కటకానా. ఇది చాలా ప్రత్యేకమైనది. క్యాప్సూల్ హోటల్స్ అనేవి జపాన్‌కు మాత్రమే ప్రత్యేకమైనవి. ఇవి ప్రయాణికులకు తక్కువ స్థలంలో వసతిని అందిస్తాయి. చివరగా, అనిమే, మంగతో సహా జపాన్ యానిమేషన్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రపంచ ఎంటర్ టైన్ మెంట్ రంగం మీద చాలా ప్రభావం చూపింది.