Deceased Relative In Dream: కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. మరికొందరికి ఎంతకీ నిద్ర పట్టదు. మనం నిద్రలోకి జారుకున్న వెంటనే మనం కలలో ఎక్కడో తిరుగుతుంటాం. ఏవో ప్రాంతాలు సంచరిస్తుంటాం. మనకు కలలో పలు రకాల మనుషులతో కలుస్తుంటాం. అసలు కలలు ఎందుకు వస్తాయి? కలలు దేనికి సంకేతం అనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మనుషులకు కలలు ఎందుకు వస్తాయి? కలలో ఎక్కడికి వెళతాం? ఏ ప్రాంతాల్లో సంచరిస్తాం అనే విషయాలపై ఎన్నో పరిశోధనలు జరిగినా అందులోని రహస్యం మాత్రం కనిపెట్టలేదు. దీంతో కలలు మనకు ఏ రకమైన నష్టాలు తెస్తాయనే దానిమీద కొన్ని అభిప్రాయాలు మాత్రం ఉన్నాయి.

మనలో కలలు కనేటప్పుడు మన పూర్వీకులు కనిపిస్తుంటారు. చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఏమవుతుంది? వారి అలా కనిపించడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా? చనిపోయిన వారు కలలో కనిపించడం మంచిదా? కాదా? అనే ప్రశ్నలు మన మెదడును తొలుస్తుంది. చనిపోయిన వారు కలలో కనిపిస్తే దేనికి సంకేతం? కలలో మన తల్లి కనిపిస్తే మన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ తండ్రి కనిపిస్తే దుష్టశక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని అర్థం. అదే అన్న గాని తమ్ముడు గాని కనిపిస్తే మీకు ప్రముఖులతో సంబంధాలు పెరిగే అవకాశాలున్నాయని భావమట. ఇలా మన పూర్వీకులు కనిపిస్తే మనకు కలిగే చర్యలకు సంకేతాలని చెబుతుంటారు.
స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు కనిపిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఏదో కీడు వస్తుందని కూడా అర్థం వస్తుంది. చనిపోయిన వ్యక్తులు కలలో కనిపించినట్లయితే మనకు ఏవో ఉపద్రవాలు వచ్చినట్లే అని చెబుతున్నారు. ఇలా మనకు కలలో ఎన్నో వైవిధ్యభరితమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పరుగెత్తాలన్నా కుదరదు. గమ్యం చేరుకోలేక అక్కడే తిరుగుతుంటాం. కలలో భలే గమ్మత్తైన విషయాలు జరుగుతుంటాయి.

కొందరికి భవిష్యత్ కూడా కనిపిస్తుంది. తెల్లవారు జరగబోయే సంఘటనలు కలలో ప్రత్యక్షం కావడం సహజమే. మనకు ఏదో ఆపద వస్తుందంటే కలలో దర్శనమివ్వడం అప్పుడప్పుడు జరుగుతుంది. కలలో చిత్ర విచిత్రాలో చోటుచేసుకుంటుంటాయి. మనకు ఎదురయ్యే కష్టాలకు కలలే సాక్ష్యాలుగా నిలుస్తాయని చెబుతుంటారు. కొందరైతే వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తాయంటారు. ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే మంచిదని అంటుంటారు. మొత్తానికి కలలు మనుషులను భలే భయపెడుతుంటాయి.