Custard Apple Benefits: మధుర ఫలాల్లో సీతాఫలం ప్రథమ స్థానంలో ఉంటుంది. అన్నిటికంటే తియ్యగా ఉండే పండుగా సీతాఫలం ముందు ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు మన శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. మగవారిలో నరాల బలహీనత రాకుండా చేస్తుంది. ఏజెన్సీలో రైతులకు సిరులు కురిపిస్తోంది. సీతాఫలం తినడంతో ఎన్నో లాభాలున్నాయి. శీతాకాలంలో లభించే సీతాఫలంతో ప్రయోజనాలున్నాయి. ఇందులో శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ బి6, సిలతోపాటు మెగ్నిషియం, కాపర్, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

సీతాఫలం పురుషుల్లో నరాల బలహీనత, కండరాల వృద్ధిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. సీతాఫలం సాగుతో రైతులకు సిరులు కురిపిస్తోంది. నరాల బలహీనతతో బాధపడేవారు ఉదయాన్నే ఒక సీతాఫలం తింటే సమస్యను దూరం చేసుకోవచ్చు. శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది. సన్నగా ఉన్న వారు సీతాఫలం తినడం వల్ల దృఢంగా మారుతారు. సీతాఫలం, తేనెను సమపాళ్లలో కలిపి తీసుకుంటే బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. మనిషి ఆరోగ్యంలో సీతాఫలం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
గర్భిణులు సీతాఫలం తింటే సుఖప్రసవం అవుతుంది. కడుపులో ఉండే బిడ్డకు కూడా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. పాల ఉత్పత్తిని పెంచడంలో సీతాఫలం అమోఘంగా సాయపడుతుంది. ఇంకా మలబద్ధకంతో బాధపడే వారికి కూడా దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసుకుని తాగితే జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. అల్సర్, గ్యాస్, ఎసిడిటి వంటి ఉదర సమస్యలను దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులకు పరిష్కారం చూపుతుంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ ఫ్రూట్ పంట రైతులకు సిరులు కురిపిస్తోంది. పార్వతీపురం, విశాఖ ఏజెన్సీ రైతులకు సీతాఫలం మంచి లాభాలు తీసుకొస్తోంది. వంద శాతం సేంద్రియ పద్ధతుల్లో సీతాఫలం తోటలను సాగుచేస్తున్నారు. దిగుబడులు బాగా రావడంతో రైతులు సీతాఫలం సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రైతుల ఇంట్లో సిరులు కురిపించే పంటగా సీతాఫలం నిలవడం గమనార్హం. దీనికి విశాఖ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో గిరిజనులు పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు.
మన్యం జిల్లాల్లో ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తోంది. కిలోకు రూ.15 నుంచి 25 వరకు వ్యాపారులు కొనుగోలు చేసి మార్కెట్ లో రూ.40 నుంచి 50 వరకు అమ్ముతుంటారు. దీంతో లాభసాటి పంటగా సీతాఫలం నిలవడం గమనార్హం.