Newspaper Colour Change: తెల్లవారితే చాలు వార్తా పత్రిక తిరగేయడం అందరికి అలవాటే. ప్రతి రోజు పేపర్ చూడనిదే దినచర్య ప్రారంభం కాని వారు కూడా కొందరు ఉండటం చూస్తుంటాం. వార్తా పత్రికతో మన అనుబంధం అలా పెనవేసుకుపోయింది. కానీ రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు కాలం మారుతోంది. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అవుతోంది. అందుకే వార్తా పత్రికల ప్రాధాన్యం కూడా తగ్గుతోంది. గతంలో వలె వార్తా పత్రికల ప్రభావం ఇప్పుడు వార్తా పత్రికల హడావిడి తగ్గిపోయింది.

వార్తాపత్రికలైనా, పుస్తకాలైనా కాలం గడిచే కొద్ది కలర్ మారిపోతుంది. పసుపు రంగులోకి కాగితం మారడం చూస్తుంటాం. ఇది ఎందుకు అవుతుంది. దీనికి కారణాలేంటని ఆరా తీస్తే సంవత్సరాలు గడిచేకొద్దీ వాటిలో ఉండే సెల్యులోజ్, లిగ్నిన్ అనే రెండు కాగితాన్ని కలర్ మారేందుకు దోహదం చేస్తాయని తెలుస్తోంది. అందుకు పేపర్ కలర్ మారి పసుపుగా మారుతుందని చెబుతున్నారు.
Also Read: ప్రతిపక్షాల సమాఖ్య కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్?
కాగితంలో ఉండే లిగ్నిన్ కణాలు గాలి, సూర్యకాంతిని తాకినప్పుడు స్పందిస్తాయి. దీంతోనే రంగు మారుతుందని తెలుస్తోంది. ఏ కాగితమైనా కొంత కాలానికి ముదురు రంగు లేదా పసుపు రంగులోకి మారుతుంది. కొన్ని రకాల పేపర్లు మాత్రం తొందరగా రంగు మారవు. దీనికి కారణం ఆ కాగితంలో ఉండే లిగ్నిన్ ను తొలగిస్తారు. అందుకేు అవి కలర్ మారకుండా ఉంటాయని చెబుతారు.

మొత్తానికి ఏదైనా కొంత కాలానికి దాని ప్రభావం తగ్గించుకోవడం చూస్తుంటాం. అది కాగితమైనా సరే ఇంకా ఏ వస్తువైనా కానీ కొంత కాలం తరువాత దాని ఉనికి మార్చుకోవడం ప్రకృతి ధర్మం. పేపర్ తయారైన తరువాత కాగితంలో ఉండే లెగ్నిన్ ద్వారానే కలర్ మారి పసుపుగా మారుతుందని ఆధారాలు తెలియజేస్తున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ పై పడ్డ వైసీపీ నేతలు.. సమస్యలు వదిలేసి వ్యక్తిగత దాడి?