Navagrahalu: హిందూ సంప్రదాయంలో అన్ని దేవుళ్లకు ఆలయాలు ఉన్నాయి. శివుడు, విష్ణువు, ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి, సూర్యుడికి కూడా ఆలయాలు ఉన్నాయి. కానీ నవగ్రహాలకు మాత్రం ఆలయాలు ఉండవు. ఎందుకంటే వాటికి ఆలయాలు నిర్మించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. దానికి కూడా కారణాలు లేకపోలేదు. అందుకే వాటికి దేవాలయాలు నిర్మించలేదని తెలుస్తోంది. దీంతో నవగ్రహాలను దేవాలయ ప్రాంగణంలోనే ప్రతిష్ట చేస్తుంటారు.

అందరు దేవుళ్లకు ప్రత్యేక ఆలయాలు ఉండటం చూస్తున్నాం. ఆలయ ఆవరణలోనే నవగ్రహాలకు ఓ స్థలం కేటాయించి వాటిని ఉంచుతారు. కానీ తమిళనాడులోని సూర్యనార్ కోయర్ వద్ద నవగ్రహాలకు విడిగా గర్భాలయాలతో ఆలయాలు నిర్మించారు. దేశంలోనే ఒక్క ఈ ప్రాంతంలోనే నవగ్రహాలకు ఆలయాలు నిర్మించడం అరుదైన విషయమే.
Also Read: ప్రతిపక్షాల సమాఖ్య కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్?
అసలు నవగ్రహాలకు గర్భాలయం ఎందుకు ఉండదనే విషయం మనకు తెలియాలి. నవ గ్రహాలు ఒక పీఠం మీద నిర్మాణం చేసినప్పుడు విగ్రహాలు అష్ట దిక్కులను చూస్తుంటాయి. దీంతో వాటికి గర్భాలయం నిర్మించడం వీలు కాదు. అందుకేు గుడికి ఒక భాగంలో ఒకే చోట అన్ని విగ్రహాలను కలిపి ఒకే చోట ప్రతిష్టించి పూజలు నిర్వహించడం తెలిసిందే.
నవగ్రహాల్లో సూర్యశక్తులు మాత్రమే భక్తులకు అభిముఖంగా ఉండడం వల్ల మిగతా విగ్రహాలు దిక్కులను చూస్తుంటాయి. అందుకే వాటికి ప్రత్యేకంగా గర్భాలయం నిర్మించడం సాధ్యం కాదు. అందుకే నవగ్రహాలకు గర్భాలయం నిర్మించరని తెలుస్తోంది. నవగ్రహాలకు గర్భాలంయ నిర్మాణం చేస్తే అది ఆగమ శాస్త్ర ప్రకారం విరుద్ధం అవుతుంది. అందుకేు నవగ్రహాలకు గర్భాలయం నిర్మించరని శాస్త్రాలు చెబుతున్నాయి.

అందుకే నవగ్రహాలకు గర్భాలంయం నిర్మించడం వీలు కాదు. దీంతో నవగ్రహాలకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించకుండా ఓ పక్కన ప్రతిష్టించి భక్తులకు అందుబాటులో ఉంచుతారు. అందుకే మొదట వాటిని దర్శనం చేసుకున్న తరువాత గర్భాలయంలోకి వెళ్లి దేవుళ్లను దర్శనం చేసుకోవడం ఆనవాయితీ.
Also Read: జనసేన పార్టీ ఆవిర్భావ సభ హై లైట్స్