Gold, Silver Prices: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు ధరలను పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 310 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే 340 రూపాయలు తగ్గి 52,470 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు అంతకంతకూ తగ్గుతుండటంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని బంగారం వ్యాపారులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర ఏకంగా 500 రూపాయలు తగ్గడంతో కిలో వెండి ధర 74,200 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో మాత్రం కిలో వెండి ధర 70,000 రూపాయలకు అటూఇటుగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 1956 డాలర్లకు క్షీణించగా వెండి ధర ఔన్స్ కు 25.31 డాలర్లకు చేరింది. బంగారం, వెండి ధరలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే.
ప్రాంతాన్ని బట్టి బంగారం, వెండి ధరలలో స్వల్పంగా తేడా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. జీఎస్టీ, ఇతర పన్నులు, మేకింగ్ ఛార్జీలను బట్టి బంగారం, వెండి కొనుగోలు చేసేవాళ్లకు ధరలు మరింత ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. బంగారం, వెండి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.
Also Read: Pawan Kalyan Target 2024: పవన్ టార్గెట్ ఫిక్స్.. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!