Annuity Plans: డబ్బు జీవితాన్ని నడిపిస్తుంది. అవసరమైనంత సొమ్ము లేకపోతే నేటి కాలంలో బతకడం కష్టం. అందువల్ల కనీస సౌకర్యాల కోసం ఏదో ఒక పనిచేయాల్సి ఉంటుంది. అయితే జీవితాంతం కష్టపడి తన పిల్లల చదువులకు ఖర్చు పెట్టి.. ఆ తరువాత తనకు ఏమీ లేకుండా ఉన్న తల్లిదండ్రులు ప్రస్తుత కాలంలో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన జీవితాలతో హాయిగా ఉన్న వారు.. తమ వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వృద్ధాప్య జీవితం కొందరికి నరకంలా మారుతంది. ఒకప్పుడు ఆలోచన లేకపోవడంతో వారు సరైన విధంగా డబ్బును కూడబెట్టుకోలేదు. దీంతో ప్రస్తుం కష్టాలు అనుభవిస్తున్నారు. కొందరు తమ పిల్లలను చేయి చాచి అడగలేక ఆత్మ గౌరవాన్ని చంపుకోలేకపోతున్నారు. వీలైతే పస్తులు ఉంటున్నారు గానీ.. డబ్బు కోసం ఎదురుచూడడం లేదు. ఇక కొందరైతే తమ శరీరం సహకరించకున్నా ఏదో ఒక పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే భవిష్యత్ ఇలాంటి కష్టాలు రాకుండా ఉండడానికి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రయోజకరమైన ప్లాన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. నెల నెలా జీతంలో కొంత మొత్తం చేతికి వస్తూ చిన్న చిన్న అవసరాలను ఇవి తీరుస్తాయి. దీంతో వీరు ఎవరి వద్ద చేయి చాచకుండా ఉండగలుగుతారు. ఇలాంటి ప్లానల్లో Annuity Plan ఒకటి. ఇది మ్యూచ్ ఫల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్. ఈ ప్లాన్ లో పెట్టుబడి ఎంత పెట్టాలి? ఎవరికి ప్రయోజనకరం అనే విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వివరాల్లోకి వెళ్లండి..
Annuity Plan గురించి చాలా మంది విని ఉంటారు. కానీ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు రాని డబ్బు కోసం ఇన్వెస్ట్ మెంట్ ఎందుకు చేయాలి? అనే భావనతో కలిగి ఉంటారు. కానీ శరీరం ఎప్పటికీ ఒకలా ఉండదు. వయసు మళ్లిన కొద్దీ సహకరించదు. ఇలాంటి సమయంలో చిన్న చిన్న అవసరాలకు డబ్బు అవసరం ఉటుంది. ప్రస్తుతం కాలంలో సొంత కొడుకులు, కూతుళ్లే పట్టించుకోవడం లేదు. ఇతరులు సాయం చేస్తారని ఆశించడం కరెస్ట్ కాదు. ఈ పరిస్థితి రాకముందే జాగ్రత్తపడాలి. అంటే ఇప్పటి నుంచే ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి.
వృద్ధాప్య సమయంలో ఉన్న వారికి Annuity Plan ఆపన్న హస్తంలా ఆదుకుంటుంది. ఇందులో వయసులో ఉన్న సమయంలో Simle Investment Plan (SIP)లో మనం ఎంచుకున్న స్కీంలో ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటూ పోతే భవిష్యత్ అవసరాలకు డబ్బు అందుతుంది. అంతేకాకుండా నెలనెలా జీతంలా వచ్చే విధంగా ప్లాన్ ను మార్చుకోవచ్చు. Annuity Plan లో రకరకాల రకరకాల పెట్టుబడులు ఉన్నాయి. వచ్చిన ఆదాయంలో నెలనెలా ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. లేదా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. అయితే నెలనెలా ఇన్వెస్ట్ మెంట్ చేసే ప్లాన్ లో భవిష్యత్ లో రిటైర్మెంట్ అయినత తరువాత తిరిగి ప్రతీ నెల జీతంలా ఆదాయాన్ని పొందవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ మెంట్ చేస్తే అసలు వడ్డీతో అందిస్తారు.
అయితే ఈ ప్లాన్ తీసుకునే సమయంలో ముందుగా పాలసీకి సంబంధించి గైడ్ లైన్స్ ను పూర్తిగా చదవాలి. ఎందుకంటే కొన్ని రిటర్న్స్ విషయంలో కంపెనీలు నిబంధనలు పెడుతాయి. వాటికి అనగుణంగా లేకపోతే ప్లాన్ వర్కౌట్ కాదు. అప్పుడు జీవితాంత చేసిన పెట్టుబడి వృథా అవుతుంది. రిటైర్మెంట్ అయ్యాక నెలనెలా ఆదాయం వచ్చే స్కీంను ఎంచుకోవడం ఉత్తమం అని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఆదాయం రావడం వల్ల వేరొకరిపై ఆధారపడే అవసరం ఉండదు. అంతేకాకుండా చేసిన పెట్టుబడి అలాగే ఉండి తమ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది.