Weight lose : ప్రస్తుత కాలంలో దాదాపు చాలామంది బరువు సమస్యతో సతమతమవుతున్నారు. బయట ఉండే కల్తీ ఆహారంతో పాటు.. వాతావరణ కాలుష్యం కారణంగా రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి బరువు పెరుగుతున్నారు. అయితే బరువు తగ్గేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కొందరు ఫలితాన్ని పొందడం లేదు. మరికొందరు ప్రత్యేకమైన మెడిసిన్ తీసుకొని అనారోగ్యాల పాలవుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సాంప్రదాయకమైన పద్ధతిలో వాడడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జపాన్లో అనుసరించిన కొన్ని విధానాల వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అసలు జపాన్లో బరువు తగ్గడానికి ఏం చేశారు? ఇలాంటి పానీయాలు తీసుకుంటారు?
Also Read : బరువు తగ్గాలని ఉందా.. అయితే పీరియడ్స్ తర్వాత ఇవి తీసుకోండి
సాధారణంగా పక్క చిక్కిన నడుము ఉండి తెల్లటి చర్మంతో కళ్ళు చిన్నగా ఉన్న వారిని చూస్తే ఖచ్చితంగా జపనీస్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడి వారు వారి రోజువారి విధులతో పాటు ఆరోగ్య నియమాలను తప్పనిసరిగా పాటిస్తారు. కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అందుకే దాదాపు జపనీస్ అంతా ఓకే రకంగా ఉంటారు. అయితే జపాన్ కు చెందిన మనుషుల్లో కొవ్వు అస్సలు కనిపించదు. అందుకు కారణం వారు తీసుకునే ప్రత్యేక డ్రింకు అని అంటున్నారు. ఆ డ్రింకు ఎలా ఉంటుందంటే?
జపాన్లో చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యం ఓ వాటర్ ను తాగుతూ ఉంటారు. అయితే ఇవి సాధారణ మంచినీరు కాదు. వీటిని ప్రత్యేకంగా ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. ఉదయం దీనిని తయారు చేసుకొని వారు రోజంతా సేవిస్తూ ఉంటారు. ఇది తాగడం వల్ల వారిలో ఎనర్జీ గా ఉండడమే కాకుండా ఎలాంటి కొవ్వు శరీరంలో పేరుకుపోదు.
జపాన్లో ఎక్కువగా తాగే వాటర్ ఎలా తయారు చేస్తారంటే? స్టవ్ పై ఒక పాత్రను ఉంచి అందులో కాసిన్ని వాటర్ పోస్తారు. అందులో పొట్టు తీసేసిన అల్లం వేసి ఆ నీటిని బాగా మరిగిస్తారు. ఆ తర్వాత అందులో పుదీన, దోసకాయలు వేస్తారు. ఈ మిశ్రమాన్ని ఎక్కువసేపు మరిగించి వడపోసిన తర్వాత ఆ నీటిని తాగుతూ ఉంటారు. ఉదయం బరిగడుపున ఒకసారి, భోజనం లేదా ఏదైనా తినే ముందు ఒకసారి దీనిని తాగుతూ ఉంటారు. ఇలా ముందే నీరు తాగి ఆహార పదార్థాలు తినడం వల్ల అవి ఏమాత్రం శరీరంలో పేరుకుపోకుండా వెంటనే జీర్ణం అవుతాయి. అంతేకాకుండా ఇవి తక్షణ శక్తిని కూడా అందిస్తాయి.
అందువల్ల జపాన్ కు చెందిన వారు ఈ డ్రింకును రోజుకు సమయం దొరికినప్పుడల్లా తాగుతూ ఉంటారు. అయితే ఈ డ్రింక్ అందరికీ అనువైనది అని చెప్పలేం. ఎందుకంటే కొందరికి అనారోగ్యాలు ఉండడం వల్ల ఇది ప్రమాదంగా మారవచ్చు. ఇందులో అల్లం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ సేపు మరగాక పోతే అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read : వామ్మో కేవలం ఇంత తక్కువ సమయంలో ఏకంగా 18 కేజీల బరువు తగ్గిందా? ఎలాగంటే?