Watching Reels Side Effects: చేతిలో మొబైల్ ఉంటే ప్రపంచం మన దగ్గరే ఉన్నట్లు. భూమ్మీద ఏ మూలన ఏం జరిగినా మొబైల్ ద్వారా కలిసిపోతుంది. దీంతో చాలామంది జ్ఞానం పెంచుకోవడానికి మొబైల్ ను ఫాలో అవుతున్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి దీనినే చూస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ఫోన్ ను వాడడంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రీల్స్ చూడడం చాలా మందికి అలవాటు అయిపోయింది. ఒక రీల్ లో చాలా విషయాలు ఉండడంతో దీనికి బానిసగా మారిపోతున్నారు. అయితే కొన్ని రీల్స్ చూస్తే పర్వాలేదు. కానీ ఇంకాసేపు.. ఇంకాసేపు అంటూ తలకు మించిన భారాన్ని మోస్తున్నారు. అది ఎలా అంటే?
Also Read: అంత భద్రత ఉన్నా.. ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి ఎలా జరిగింది?
మొబైల్లో ఒకసారి రీల్ చూడడం స్టార్ట్ అయితే ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉంటుంది. ఇలా ఎన్ని రీల్స్ చూసిన తనివి తీరదు. అయితే కొంతమంది ఇంకాసేపు చూద్దాం అనుకుంటూ మొబైల్ పై స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా పదుల రీల్స్ నుంచి 100 రీల్స్ వరకు చూస్తూనే ఉంటారు. సమయం కూడా తెలియకుండా రీల్స్ చూడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇలా వరుసగా వందలకొద్దీ రీల్స్ చూడడం వల్ల మద్యం సేవించే దానికంటే ఐదు రెట్ల నష్టం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వరుసగా రీల్స్ చూడడం వల్ల మనసు ప్రశాంతతను కోల్పోతుంది. కొన్ని ప్రత్యేక వీడియోలు చూసిన తర్వాత ఆ విషయం పైనే ఎక్కువగా ఆలోచన ఉంటుంది. వీటిలో నెగటివ్ వీడియోలు చూసినవారు అవే ఆలోచనలతో ఉంటారు. ఫలితంగా జీవితంపై ప్రభావం ఉంటుంది.
వరుసగా ఎక్కువ శాతం రీల్స్ చూసేవారు సున్నితత్వాన్ని కోల్పోతారు. అంటే ఇతరులతో మాట్లాడే సమయంలో మర్యాదగా ఉండకుండా నిత్యం కోపంతో రగిలిపోతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతో సైతం నిదానంగా మాట్లాడకుండా రాష్ గా ప్రవర్తిస్తారు. రీల్స్ ఎక్కువగా చూడడం వల్ల మనసులోకి కొత్త ఆలోచనలు వస్తాయి. ఇవి సాధారణం కంటే భిన్నంగా ఉండి మనసును ఆందోళన వైపు నడిపిస్తాయి. ఇటీవల చాలామంది రీల్స్ చూసి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ముఖ్యంగా యువత తమ చదువుపై దృష్టి పెట్టకుండా రీల్స్ చూడడం పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మగాళ్లు కోరుకునేది ఇదే..
కొన్ని నివేదికల ప్రకారం ప్రతిరోజు 200 మిలియన్ల రీల్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆకర్షణీయమైన.. ఆకట్టుకునే వీడియోలు ఎక్కువగా ఉండటంతో చాలామంది వీటిని ఎక్కువగా చూస్తున్నారు. యూట్యూబ్లో లాడ్జ్ వీడియోస్ కంటే రీల్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా రకరకాల వీడియోలు ఒకేసారి చూడడం వల్ల మెదడులో అనేక మార్పులు జరిగే అవకాశం ఉందని వైద్యం చెబుతున్నారు. అదే పనిగా కొన్ని గంటల పాటు రీల్స్ చూడడం వల్ల ఒక మనిషిలో ఎన్నో రకాల మార్పులు చూసే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు రీల్స్ చూడడం తగ్గించాలని సూచిస్తున్నారు.