HomeతెలంగాణRevanth Reddy Vice President Election: రేవంత్ రెడ్డి విన్నపం పనిచేస్తుందా?

Revanth Reddy Vice President Election: రేవంత్ రెడ్డి విన్నపం పనిచేస్తుందా?

Revanth Reddy Vice President Election: ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్కడ్‌ వ్యక్తిగత కారణాలతో ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం టిఫికేషన్‌ విడుదల చేసింది. అధికార ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ప్రధాని, కేంద్ర మంత్రులు విపక్షాలను కోరుతున్నారు. ఈ తరుణంలో విపక్ష ఇండియా కూటమి అనూహ్యంగా పోటీకి సై అంది. తెలుగు వ్యక్తి, సుప్రీకోర్టు రిటైర్డ్‌ జడ్జి సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నాయకులైన చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్‌మోహన్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌లకు ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు.

Also Read: ఉపరాష్ట్రపతిని నిలిపేంత.. రేవంత్ రెడ్డి పరపతి బాగా పెరిగిందే!

మచ్చలేని వ్యక్తిగా…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. రాజకీయ జోక్యం లేని వ్యక్తిగా, సుదర్శన్‌ రెడ్డి నిష్పక్షపాతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగిన వ్యక్తిగా రేవంత్‌ రెడ్డి వర్ణించారు. ఇది దేశానికి ప్రస్తుతం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సుదర్శన్‌ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కావడం, అతని గొప్ప ఖ్యాతిని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని, చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్‌ కళ్యాణ్, బీజేపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల నుంచి విముక్తమైన వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవిలో నిష్పక్షపాతంగా వ్యవహరించగలడని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్‌డీఏ మిత్రపక్షాలుగా ఉన్నందున, వారు ఎన్‌డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వడం దాదాపు ఖాయం. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకారం, జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తన పార్టీని ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. ఇక బీఆర్‌ఎస్‌ ఎన్‌డీఏతో ఉన్న దూరం కారణంగా వారు ఎవరికి మద్దతు ఇస్తారనేది స్పష్టంగా తెలియదు. ఈ సందర్భంలో వారి నిర్ణయం కీలకంగా ఉండవచ్చు.

Also Read:  తెలంగాణ పోలీస్ శాఖలోకి ప్రైవేట్ వ్యక్తి.. బదిలీలు, పదోన్నతులు, సెటిల్మెంట్లు

రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. అయితే, రాజకీయ సమీకరణలు, ఒప్పందాలు ఈ విజ్ఞప్తి ఫలించే అవకాశాలను తగ్గిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో సుదర్శన్‌ రెడ్డి విజయం బీఆర్‌ఎస్‌ వంటి పక్షాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి విన్నపం ఏ మేరకు పనిచేస్తుంది అన్నది ప్రశ్నార్థకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular