What men want after 40: మానవ సంబంధాలు ఇప్పటికంటే పూర్వకాలంలోనే బలంగా ఉండేవి. అంటే మనుషుల మధ్య కమ్యూనికేషన్.. కలిసిమెలిసి ఉండడం.. పెళ్లయిన వారు జీవితాంతం ఒక్కటిగా ఉండడం వంటివి ఉండేవి. అయితే ఇలా అన్ని రకాలుగా ఉండడానికి పెద్దలు కొన్ని పద్ధతులు నిర్ణయించేవారు. వీటిని ఇప్పటి వారు చూసి మూఢనమ్మకాలు అని అనుకుంటున్నారు. కానీ మనుషుల్లో ప్రవర్తన.. వారి అలవాట్లు తదితర కారణాలవల్ల వారిని కంట్రోల్ చేయడానికి కొన్ని నిబంధనలు విధించేవారు. వీటిలో 40 ఏళ్లు దాటిన భార్యాభర్తలను కాశీకి పంపేవారు. అసలు ఈ సమయంలో వీరిని కాశీకి పంపడానికి కారణం ఏమిటి?
ప్రస్తుత కాలంలో మనుషుల మనస్తత్వాలు పూర్తిగా మారిపోయాయి. కొందరిలో విపరీతమైన కోరికలు పుట్టుకొస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కొందరు అనేక తప్పుడు పనులు చేస్తున్నారు. ఎక్కువ వయసు ఉన్న మగవాళ్లు.. చాలా చిన్న వయసు ఉన్న వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే ఇలా ఏర్పడడానికి వారి మనసులో ఉండే కొత్త ఆలోచనలే కారణమని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.
ప్రతి పురుషుడికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత.. వారిలో కొత్త మార్పులు వస్తుంటాయి. అప్పటికే వారు జీవితంలో ఏదో ఒకటి సాధించి ఉంటారు. ఆ తర్వాత వారి గొప్పతనం, హుందాతనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో ఎదుటి వారిపై ఆధిపత్యం చేయడానికి రకరకాల పనులు చేస్తుంటారు. వీటిలో కొత్త సంబంధాన్ని కూడా కోరుకుంటారు. అయితే ఇలాంటి సమయంలో అప్పటికే ఉన్న భార్య లేదా సహచరిని పై కాస్త ప్రేమ తగ్గి అవకాశాలుంటాయి. అంతేకాకుండా అప్పటివరకు ఉన్న భార్య లేదా సహచరునిపై నిత్యం ఏదో ఒక రకంగా దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఎవరైనా కొత్తవారు పరిచయం ఏర్పడితే వారితో అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేస్తారు.
Also Read: భార్యలకు భర్తలు ఎందుకు భయపడతారు?
ఈ పరిస్థితిని పెద్దలు ఆనాడే గ్రహించి మగవారికి 40 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నచోట ఉండనీయకుండా.. కాశీకి లేదా ఇతర దూర ప్రదేశాలకు పంపేవారు. ఈ సమయంలో వారికి తోడుగా భార్యను కూడా పంపేవారు. ఎందుకంటే ఉన్నచోట కాకుండా వేరే ప్రదేశానికి భార్యతో కలిసి వెళ్లడం వల్ల వారి మనస్తత్వాల్లో మార్పులు రాకుండా ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగేలా ఈ యాత్ర చేస్తుంది. అంతేకాకుండా దైవ కార్యక్రమానికి వెళ్తున్నామని ఫీలింగ్ లో ఉండి వేరే ఇతర ఆలోచనలను రానీయకుండా చేస్తారు. ఇలా మగవారి పరిస్థితిని అర్థం చేసుకున్న పెద్దలు వారిని కంట్రోల్ చేసేవారు.
ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అందుకే కొందరు 40 సంవత్సరాలు దాటిన వారు అనేక తప్పుడు పనులు చేస్తూ సమాజంలో గుర్తింపును కోల్పోతున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రం ఇదే సమయంలో తమ జీవితాన్ని సరైన మార్గంలో ఉంచేలా ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా బరువు బాధ్యతలు మరింతగా పెరిగి డబ్బు సంపాదించడం.. లేదా పిల్లల అభివృద్ధి కోసం ఆరాటపడడం వంటివి చేస్తున్నారు.