Delhi CM Attack: పిల్లి ముఖ్యమంత్రి రేఖాగుప్తా పై దాడి జరిగినట్టు జాతీయ మీడియాలో బుధవారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఆమె అధికారిక నివాసంలో “జన్ సువాయ్” కార్యక్రమం నిర్వహించారని.. ఆ కార్యక్రమం జరుగుతుండగానే ఒక ఈ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి.
రేఖా గుప్తా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ముఖ్యమంత్రి భద్రతను పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటారు. మూడు అంచల భద్రత సీఎం చుట్టూ ఉంటుంది. చివరికి ఆమె అధికారిక నివాసంలో జన్ సువాయ్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా భద్రత అదే స్థాయిలో ఉందని తెలుస్తోంది. అంతటి భద్రత ఉన్న పట్టి కూడా ఆమెపై ఎలా దాడి జరిగిందనేది అర్థం కావడం లేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ” ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తన నివాసంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన విపరీతంగా ఉంది. ముఖ్యమంత్రి నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అయినప్పటికీ ఆమెపై దాడి జరిగింది. ఇలా ఎందుకు జరిగిందనేది అర్థం కావడం లేదని” జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొంటున్నది.
Also Read: సైన్యం చేతికి హైదరాబాద్ అత్యాధునిక ఆయుధం
రేఖ గుప్తా ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి ఇంటిలిజెంట్ రిపోర్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆమెకు భద్రతను మరింత పెంచింది. ఆమె భద్రతను కేంద్ర బలగాలు కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఢిల్లీ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడం.. చాలా రోజుల తర్వాత ఢిల్లీలో బిజెపి అధికారంలోకి రావడం.. వంటి పరిణామాల నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఆ నివేదిక ప్రకారం కేంద్ర హోం శాఖ రేఖ గుప్తాకు భద్రతను పెంచింది. అంతటి భద్రత ఉన్నప్పటికీ ఓ వ్యక్తి ఆమెపై దాడి చేయడం విశేషం.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వచ్చి రేఖా గుప్తా చెంప మీద కొట్టారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని.. అతడికి సంబంధించిన వివరాలు ఢిల్లీ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం.
Delhi CM slapped during public grievance hearing, cops nab attacker.
35 year old attacker slapped CM: CM House@ArvindOjha gets us more details. #DelhiCM #RekhaGupta #JanSunvai #BJP #ITVideo #TheBurningQuestion | @Sriya_Kundu pic.twitter.com/j3BcQKwQMr— IndiaToday (@IndiaToday) August 20, 2025