Parenting tips: ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచడం పెద్ద ప్రయాసే. ఎందుకంటే కుటుంబ పరిస్థితులతో పాటు సమాజంలో వాతావరణం పొల్యూషన్ గా మారింది. ఈ క్రమంలో పిల్లలు కొందరు తప్పుడు దారులు పడుతున్నారు. అయితే పిల్లలు బాగుండడానికైనా.. చెడిపోవడానికి అయినా తల్లిదండ్రులే కారణమని అంటారు. మరి కొందరు మాత్రం సమాజం బాగా లేనందున వారు అలా తయారవుతున్నారని చెబుతారు. సమాజం పరిస్థితి పక్కన వస్తే.. పిల్లలు ఎక్కువగా గడిపేది ఇంట్లోనే. అంటే ముందుగా ఇంటి వాతావరణాన్ని స్వచ్ఛంగా తయారు చేస్తే సమాజంలో ఉన్న వాతావరణాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణాన్ని ఉంచుతూ.. వారికి కొన్ని అలవాటులను నేర్పించాలి. అలవాట్ల వల్ల వారు తమ జీవితాన్ని చక్కపెట్టుకుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఈ అలవాట్లు అయితే కచ్చితంగా నేర్పించాలని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. అవేంటంటే?
Also Read: మీ కుటుంబంలో ఇలాంటి వారు ఉన్నారా? జాగ్రత్త..
మనం ఏదైనా ఒక ప్రయాణం చేసినప్పుడు దారి తెలియదు. ఇలా అడ్రస్ తెలియని సమయంలో ఇప్పుడున్న కాలంలో అయితే చాలామంది గూగుల్ మ్యాప్ ను ఓపెన్ చేసి అందులో అడ్రస్ ను తెలుసుకుంటున్నారు. ఇలా గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసే అలవాటు పిల్లలకు కూడా అవుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కూడా పిల్లలు ఏదైనా అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేస్తారు. కానీ వారికి మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒకప్పుడు దారి తెలియకపోతే ఎవరైనా కనిపిస్తే వారిని అడ్రస్ అడిగే వాళ్ళం. అంటే వారిని అడ్రస్ అడుగుతే వారు ఎలా మాట్లాడుతారు అనే విషయం మనకు తెలుస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. మనసుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఇది ఒకప్పుడు జరిగి వారు కమ్యూనికేషన్ పరంగా అంతా బాగా ఉండేవారు. ఇదే విషయాన్ని పిల్లలకు కూడా నేర్పించాలి. ఏదైనా అడ్రస్ కావాలంటే కేవలం మొబైల్ చూపించకుండా ఇతరుల వద్దకు వెళ్లి వారిని అడగాలని చెప్పాలి. అలా చెప్పడం ద్వారా ఎదుటి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.. మనం ఎలా మాట్లాడాలి అనే విషయం వాళ్లకు తెలిసిపోతుంది. అందువల్ల ఈ విషయాన్ని వారికి తప్పనిసరిగా నేర్పించాలి.
Also Read: ఇంటర్నెట్ విప్లవం.. సెకనులో నెట్‌ఫ్లిక్స్ డౌన్‌లోడ్!
ఇక ప్రస్తుత కాలంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఇప్పుడు కూడా మొబైల్ నే యూస్ చేస్తున్నారు. ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలని అంటే కిరాణం షాపుకు వెళ్లి కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇలా కిరాణం షాపులోకి వెళ్లి వస్తువు ఎలా కొనుగోలు చేయాలి? ఎంత డబ్బులు ఇవ్వాలి? ఎంత డబ్బులు మనకు వస్తాయి? అనే విషయం తెలిసిపోయేది. దీనివల్ల మెదడు కూడా చురుగ్గా మారేది. కానీ ఇప్పుడు పిల్లలకు ఆ విషయం చాలామంది తల్లిదండ్రులు చెప్పడం లేదు. అయితే ఇప్పటికైనా తమ పిల్లలను చిన్నచిన్న అవసరాలకు కిరణం షాపులకు పంపించాలి. అలా పంపించడం ద్వారా వారు సొంతంగా డబ్బులను ఎంత ఇవ్వాలి? ఎంత రాబట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇది భవిష్యత్తులో కూడా వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.