memory : మన జ్ఞాపకశక్తి ఒక నైపుణ్యం కదా. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా దీన్ని మెరుగుపరచవచ్చు. ఈ మధ్య ఉన్న టెన్షన్ లు, ఉరుకులు పరుగుల జీవితంలో ఏ వస్తువు ఎక్కడ పెట్టామో కూడా మర్చిపోతున్నాం. ఏ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా సరే మర్చిపోతున్నారు. తీసుకునే ఆహారం, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, సోషల్ మీడియా ప్రభావం వంటివి మనిషి మెదడు మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్ని టెన్షన్ లలో మీ మెదడును, జ్నాపక శక్తిని పెంచుకునే అవసరం మాత్రం మీకే ఉంది. అందుకే జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని మార్గాల గురించి ఇప్పుడు చూసేద్దాం.
జ్ఞాపక శక్తి కూడా కండరాల బలం లాంటిది అంటున్నారు నిపుణులు. మనం దాన్ని ఎక్కువగా వాడే కొద్దీ అది చిన్నగా అవుతుందట. సరైన పరిశోధన, ప్రక్రియ, అవగాహనతో ఏదైనా అధ్యయనం చేయడం వల్ల సమాచారాన్ని ఎక్కువ కాలం ఉంచుకోవడానికి సహాయపడుతుందట. చదువుతున్నప్పుడు ఒకే విధమైన ఆలోచనలు లేదా సమూహ సంబంధిత భావనలను కలిపి ప్రాక్టీస్ చేయడం వల్ల సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడానికి సహాయపడుతుంది. కుదిరితే జ్ఞాపిక పరికరాలను ఉపయోగించండి. మీకు మరింత గుర్తుండిపోయేలా సాధారణమైన వాటితో నేర్చుకోవాల్సిన పదాన్ని ఉపయోగించండి.
కొందరు చాలా గట్టిగా చదువుతుంటారు. గట్టిగా చదివితే పక్క వారికి డిస్ట్రబ్ అవుతుందని కూడా పట్టించుకోకుండా మరీ గట్టి గట్టిగా చదువుతుంటారు. ఇలా బిగ్గరగా చదివినప్పుడు, మెటీరియల్‌లను బాగా గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. అయితే అందరికీ ఇది వర్తించదు. కొందరికి స్లోగా, కళ్లతో, నోటితో చదివితే మాత్రమే గుర్తు ఉంటుంది. గట్టిగా చదివితే మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ అలవాటును బట్టి దీన్ని సవరించుకోండి.
పరీక్షకు ముందు రాత్రి త్వరగా నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. నిద్ర ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి. కొత్త సమాచారం మీకు ఇప్పటికే తెలిసిన, గుర్తుంచుకోవాల్సిన వాటి మధ్య కనెక్షన్‌ని ఏర్పరచుకోండి. ఇక ధ్యానం దృష్టి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అభ్యాసం వంటి అనేక అభిజ్ఞా విధులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఈ జ్నాపకశక్తిని మెరుగుపరచే ఆహారాలు కూడా ఉన్నాయి. ఎర్ర ద్రాక్ష, బ్లూబెర్రీలు మంచి పాత్ర పోషిస్తాయి. అయితే ఈ రెండిటిలో వాటికి ముదురు రంగును అందించే ఆంథోసియానైన్లు అనే పాలీఫెనాల్స్ లభిస్తాయి. పాలీఫెనాల్ మిశ్రమాలు ఇతర బెర్రీల్లో కూడా ఉంటాయి. ఇవి శరీరంలో జీర్ణమైనపుడు అవి రక్తనాళాల సరళతను, మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల మెదడుకు మరిన్ని శక్తి పోషకాలు, ఆక్సిజన్ అందుతుంది అంటున్నారు నిపుణులు. అంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది అన్నమాట. ఇక గ్రీన్ టీ చాక్లెట్ వంటివి కూడా మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.